రోడ్ల కనెక్టివిటీతో ఎకనామిక్ యాక్టివిటీ : సీఎం చంద్రబాబు

Publish Date:Apr 8, 2026

Advertisement

 

ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని సీఎం చంద్రబాబు  దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారులు రాష్ట్రంలోని పోర్టులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలను కనెక్ట్ చేసేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు. సచివాలయంలో బుధవారం రహదారులు భవనాలు, రవాణా, జాతీయ రహదారి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్సుల వినియోగం, వివిధ రాష్ట్రాలను అనుసంధానించేలా జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణంపై సమీక్షలో చర్చించారు. 

 

 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...‘‘రాష్ట్రంలో రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలి. మొత్తంగా 45,433 కిలోమీటర్ల మేర రోడ్లు ఉంటే... వాటిల్లో ఏటా 10,238 కిలోమీటర్ల మేర నిరంతర నిర్వహణ చేయాల్సి ఉంది. ప్రజలకు రోడ్ల వల్ల ఇబ్బంది లేకుండా చూడాలి. రోడ్ల నిర్వహణ అనేది నిరంతర ప్రక్రియగా చేపట్టాలి. ఎక్కడైనా రోడ్లకు గుంతలు పడితే... వాటినే వెంటనే సరిదిద్దితే ఇక ఇబ్బందులు ఉండవు. రోడ్ల నిర్వహణలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి పద్దతులను అవలంబిస్తున్నారనే అంశాన్ని అధ్యయనం చేయాలి. ఆర్ అండ్ బీ రహదారుల మెయింటెనెన్స్ కోసం నిధుల కొరత లేకుండా చూడాలి. వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి దాని ఆధారంగా రహదారుల నిర్మాణం జరగాలి. రహదారి నిర్వహణకు ప్రామాణికతను నిర్దేశించాలి. 

స్థానికంగా భౌగోళిక పరిస్థితులు, వాతావరణం అంశాలను పరిగణనలోకి తీసుకుని రోడ్ల నిర్వహణలో చర్యలు చేపట్టాలి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, బ్లాక్ కాటన్ సాయిల్ ఉన్న చోట హైబ్రీడ్ మోడల్ లో బీటీ లేదా వైట్ ట్యాప్ రోడ్ల నిర్మాణం చేపడితే బాగుంటుంది. కాలువలు ఉన్న 570 కిలోమీటర్ల మేర రహదారులు పదే పదే ధ్వంసం అవుతున్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో ఏ మెటీరియల్‌తో రోడ్ల నిర్మాణం జరిగితే బాగుంటుందనేది ఆలోచన చేయాలి. దీనిపై యూనివర్శిటీల్లో అధ్యయనం చేయిస్తే కొత్త ఆవిష్కరణలు వస్తాయి. గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రోడ్ల మరమ్మతులు చేపట్టండి. 

గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మొత్తంగా 471 గ్రామాల్లో రోడ్లను మరమ్మత్తులు చేపట్టాలి. గ్రేటర్ రాజమహేంద్రవరం పరిధిలో చేపట్టే రోడ్ల అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా పనులు చేపట్టాలి. పుష్కరాలకు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.400 కోట్లతో 531 కిలోమీటర్ల పొడవైన రహదారులను అభివృద్ధి చేయాలి. దీని కోసం సాస్కీ నిధులను వినియోగించుకోవాలి. కుంభమేళా తరహాలో పుష్కరాలకు నిధులు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని’ అని సీఎం సూచించారు.   

పోర్టుల అనుసంధానానికి ప్రాధాన్యత

"రాష్ట్రంలోని పోర్టులను కనెక్ట్ చేసేలా జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలి. ఆర్ధిక లావాదేవీలకు కేంద్రంగా పోర్టులు ఉన్నాయి. పోర్టులను కనెక్ట్ చేసేలా పశ్చిమ భారతంలో గుజరాత్ మోడల్ అలానే ఉంది. తూర్పు భారతంలో తీర ప్రాంతం, పోర్టుల విషయంలో ఏపీ కీలకంగా ఉంది. ఈస్ట్-వెస్ట్ కారిడార్ గా జాతీయ రహదారుల నిర్మాణం జరగాలి. ఈ రకమైన కనెక్టివిటీని పెంచడం ద్వారా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గించటమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలి. లాజిస్టిక్స్ రంగాన్ని రాష్ట్రంలో అభివృద్ధి చేసేలా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలి. దీని నిమిత్తం ఏపీ లింక్ ద్వారా ఆర్ధిక వనరుల్ని సమకూరేలా ప్రణాళికలు సిద్దం చేయాలి. మౌలిక సదుపాయాల ద్వారా సామాన్యుడికి సౌకర్యాలు పెరగాలి, ఇదే సమయంలో ఆర్ధిక లావాదేవీలు జరగాలి. ప్రభుత్వం ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం ఖర్చు చేస్తోంది. 

ప్రతి పైసా సద్వినియోగం కావాలి. అత్యుత్తమ ఫలితాలు రావాలి. ప్రస్తుతం 73 శాతం కార్గో రోడ్ రవాణ ద్వారానే  వెళ్తోంది. రైల్వే ద్వారా వెళ్లే కార్గో వ్యయం తక్కువగా ఉన్నట్టే రహదారుల కార్గో వ్యయం కూడా తగ్గాల్సిన అవసరం ఉంది. మూలపేట, విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టుల మధ్యనున్న ప్రాంతాలను అనుసంధానిస్తూ జాతీయ రహదారుల నిర్మాణం జరగాలి. ఆయా పోర్టులను అనుసంధానం చేసే సమయంలో ఆయా పోర్టులకు సమీపంలోని పొరుగు రాష్ట్రాల సరిహద్దులను కలుపుకుని వెళ్లేలా ప్రధాన రహదారులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఉండాలి. రహదారుల నిర్మాణం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలి. జాతీయ రహదారులకు సమీపంలో ఉండే ప్రాంతాల అభివృద్ధి జరగాలి. జాతీయ రహదారులతో పాటు దేశ నిర్మాణం జరగాలి. ఏపీ పారిశ్రామిక, ఉద్యాన ఉత్పత్తుల కేంద్రంగా మారుతోంది. 

జాతీయ అంతర్జాతీయ మార్కెట్లకు కనెక్టు చేసేలా రహదారులు రావాలి. వివిధ నగరాలకు రింగ్ రోడ్లు వస్తే ఆయా ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాలు విస్తృతం అవుతాయి.  పొరుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాలను ఏపీని కనెక్టు చేసేలా రహదారుల నిర్మాణం జరగాలి. ఖరగ్ పూర్- అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే, హైదరాబాద్-శ్రీశైలం డోర్నాల హైవే, కల్వకుర్తి-నంద్యాల హైవే వంటి జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే కనెక్టివిటీ మరింత పెరుగుతుంది. వివిధ కారిడార్ల ద్వారా 1335 కిలోమీటర్ల జాతీయ రహదారుల రెండేళ్లలో అందుబాటులోకి వస్తాయి. ఈ ఏడాదిలో రూ.24,502 కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి కావాలి. రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు ప్రాంతాల్లో అవుటర్ కారిడార్ మోడల్స్ ను అధ్యయనం చేయాలి." అని ముఖ్యమంత్రి నిర్దేశించారు. 

ఈవీలతో తక్కువ రవాణా వ్యయం

"అతి తక్కువ వ్యయంతో ప్రజా రవాణా అందుబాటులోకి రావాలి. దీనికి ఈవీ బస్సుల వినియోగం సరైన మార్గం. క్లీన్ ఫ్యూయెల్ వినియోగం ఎక్కువ జరిగితే ఖర్చు తగ్గుతుంది. ఫలితాలు ప్రజలకు అందుతాయి. సోలార్ పవర్ ను సమర్థంగా నిర్వహించడం ద్వారా విద్యుత్ కొనుగోలు ధరను సుమారు రూ.1 మేర తగ్గించ గలిగాం. కాస్ట్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఫ్యూయల్ విధానంపై దృష్టి సారిస్తే తక్కువ ఖర్చు.. ఎక్కువ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఈవీ బస్సులకు కిలోమీటరుకు రూ.72 వ్యయం అవుతోంది. 

 

 

వివిధ మోడళ్లను అధ్యయనం చేసి అతి తక్కువ వ్యయంతో ఈవీలను ఆపరేట్ చేయాలి. ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ స్టాండర్డైజేషన్ లాంటి అంశాలను పరిశీలించాలి. అన్నీ కేటగిరీల్లోనూ ఏసీ ఈవీ బస్సులే ఉండాలి. ఈ సైకిళ్ల వినియోగం మరింతగా పెంచేలా ప్రమోట్ చేయాలి. ఈ-సైకిళ్లు మాస్ ట్రాన్ పోర్టుగా మారేంతగా ప్రజలకు అవగాహన కల్పించాలని" సీఎం స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం, జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

By
en-us Political News

  
జగిత్యాల ముఖ్య నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు.
భాగ్యనగర వాసుల జీవనాడి, అత్యంత వేగవంతమైన ప్రయాణానికి వేదికైన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై మరోసారి నిబంధనలు తుంగలో తొక్కారు.
హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠాపై చాదర్‌ఘాట్ పోలీసులు కొరడా ఝళిపించారు.
లోక్ సభ నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రకారం, లోక్ సభ సీట్లు 543 నుంచి 850కు పెరిగే అవకాశం ఉంది
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి హల్‌చల్.. 67 మంది యువతులకు వలపు వల
తెలంగాణ రాష్ట్రంలో వేసవి తీవ్రత పతాక స్థాయికి చేరుతోంది.
దేశంలో తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్ ను సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో ఆవిష్కరించారు.
సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చి వ్యాఖ్యల ప్రకారం.. ఇరుపక్షాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరేందుకు సానుకూల వాతావరణం ఉంది. కానీ మారుతున్న లక్ష్యాలు, బాహ్య జోక్యం వల్ల శాంతి చర్చల్లో పురోగగతి నిలిచిపోయి ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఇక ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా అమెరికా తన విధానాన్ని మార్చి, ఇరాన్ హక్కులను గౌరవిస్తే ఒప్పందం సాధ్యమేనని స్పష్టం చేశారు.
తనదైన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచశ్రేణి బౌలర్లకు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చెమటలు పట్టిస్తున్నాడు.
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వంట గ్యాస్ కొరత తీవ్రంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.