పిల్లలే సంపద పేరుతో త్వరలో కొత్త కార్యక్రమం : సీఎం చంద్రబాబు

Publish Date:May 16, 2026

Advertisement

 

దేశ ప్రగతిలో పిల్లలే అసలైన సంపద అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. జనాభా తగ్గుదల ఆందోళన కలిగిస్తోందని, జనాభా తగ్గుదల రేటును అరికట్టేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. పిల్లలే సంపద పేరుతో త్వరలో కొత్త కార్యక్రమం చేపడతామని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రకటించారు. పాపులేషన్ మేనేజ్మెంట్ ద్వారా జనాభాను దేశానికి సంపదగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. మూడో సంతానానికి  రూ.30 వేలు, నాలుగో సంతానానికి రూ.40 వేలు ప్రోత్సాహకంగా అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. 

చాలామంది ఒక బిడ్డతోనే సరిపెట్టుకుంటున్నారని ఈ కారణంగా చాలా దేశాల్లో జనాభా తగ్గి వృద్ధుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. దీని వల్ల ఆయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని స్పష్టం చేశారు. గతంలో కుటుంబ నియంత్రణ అమలు పై విస్తృతంగా పనిచేశామని.. ఇప్పుడు మారిన పరిస్థితుల రీత్యా పిల్లలే సంపద అని పిలుపునిస్తున్నానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ద్వారా జననాల రేటును పెంచేలా చర్యలు చేపడతామని సీఎం స్పష్టం చేశారు. స్త్రీశిశు సంక్షేమ శాఖ ద్వారా తల్లులకు, పిల్లలకు పౌష్టికాహారం అందించేలా ఆంగన్వాడీ కేంద్రాలను కూడా బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు ఆర్ధిక సాయం కూడా అందిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.
 

By
en-us Political News

  
పరస్పర అంగీకారంతో ప్రేమ బంధాల్లో ఉండే టీనేజర్లపై ఆటోమేటిక్‌గా అత్యాచార కేసులు నమోదు కాకుండా నిరోధించేందుకు.. తమ దేశ అత్యాచార నిరోధక చట్టంలో ఒక ప్రత్యేకంగా రోమియో జూలియట్ క్లాజ్ తీసుకు రావాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది.
కొన్ని రోజులుగా ఆమెపై ఇన్‌స్టాగ్రామ్‌, ఇతర సోషల్ మీడియా వేదికల్లో కొందరు వ్యక్తులు అసభ్యకర పోస్టులు, అవమానకర కామెంట్లు చేస్తూ టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా.. గౌరవాన్ని కించప రిచేలా పోస్టులు వైరల్ చేస్తున్నారు.
నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన 14 మంది విద్యార్థులకు మంత్రి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా విమాన ప్రయాణంతో కూడిన వైజాగ్, అరకు వ్యాలీ టూర్‌ను ఏర్పాటు చేశారు. ఫ్లైట్ టికెట్లు చేతిలో పడగానే విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఇద్దరు విదేశీయులు తమ లగేజ్ బ్యాగుల్లో గంజాయిని అత్యంత గుట్టుగా తరలించే ప్రయత్నం చేశారు. గంజా యిని చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి, వాటిని వ్యాక్యూమ్ సీల్ చేసి కస్టమ్స్ తనిఖీల్లో అనుమానం రాకుండా ప్లాన్ చేశారు.
కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (టి), పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాల ప్రాంతాల్లో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్‌ రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. కేవలం ఈ ప్రాంతాల్లోనే కాకుండా, రాష్ట్రంలోని దాదాపు 16 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46.2 డిగ్రీల నుంచి 46.5 డిగ్రీల సెల్సియస్‌ మధ్య రికార్డవడం ప్రస్తుత పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
kohli reject to shake hand with travis head, contraversym ipl2026, sunrisers,rch, match
రన్ మెషీన్ గా పరుగుల సునామీ సృష్టించే విరాట్ కోహ్లీ.. వ్యక్తిగత స్కోరుతోనే కాకుండా, పార్టనర్ షిప్ లు నెలకొల్పడంలోనూ తనకు తానే సాటి అని ఈ రికార్డు ద్వారా నిరూపించుకున్నాడు.
దేశంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఏకంగా 270.82 గిగావాట్ల విద్యుత్ వాడకం నమోదింది. ఇది భారత విద్యుత్ రంగ చరిత్రలో కొత్త రికార్డు. ప్రభుత్వం ఈ వేసవి కాలానికి అంచనా వేసిన గరిష్ట డిమాండ్ 270 గిగావాట్లను కూడా ఈ రికార్డు దాటేసింది.
గుర్తు తెలియని వ్యక్తులు మధును దారుణంగా నరికి చంపారు. హత్య అనంతరం సాక్ష్యాలను తారుమారు చేసేందుకు శరీర భాగాలను గోనె సంచుల్లో గట్టిగా కట్టేశారు. ఆపై ఆ గోనె సంచులను సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్‌ కాల్వలో పడేశారు. కాల్వలో అనుమానాస్పదంగా పడి ఉన్న గోనె సంచులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అమెరికా డాలర్ రోజురోజుకూ బలోపేతం కావడం... యూఎస్ డెట్ సెక్యూరిటీలపై రాబడులు ఊహించని విధంగా పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి నుంచి తమ లాభాల స్వీకరణకు, అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు.
ప్రత్యేక బిహేవియర్ కోడ్ ఆఫ్ కండక్ట్.. అంటే పర్యాటకులతో మర్యాదగా ప్రవర్తించేలా ఒక ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటక ప్రాంతాలకు వచ్చే కుటుంబాలు, ముఖ్యంగా మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనీ, మహిళా పర్యాటకులు ఎక్కడా అసౌకర్యానికి, వేధింపులకు గురికాకుండా కఠిన నిఘా ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ ఇంధన ధరల పెంపు తొలి సారి మే 15 న, ఆ తర్వాత వెంటనే మే 19 న రెండోసారి కూడా చమురు కంపెనీలు ధరలను పెంచాయి. ఇప్పుడు శనివారం జరిగిన తాజా పెంపుతో కలిపి గత 10 రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు 5 రూపాయల మేర పెరిగాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 79 , అభిషేక్ శర్మ 22 బంతుల్లో 56 , హెన్రిచ్ క్లాసెన్ 24 బంతుల్లో 51 పరుగులతో చెలరేగారు. చివరిలో నితీశ్ కుమార్ రెడ్డి కూడా12 బంతుల్లో 29 నాటౌట్ తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.