హెల్త్ పాడుచేస్తున్న సిటీ లైఫ్ స్టైల్..!

Publish Date:May 16, 2018

Advertisement

 

గ్రాడ్యుయేషన్ అయిపోగానే, జీవితపు ధ్యేయాన్ని చేరుకోవడానికి మరింత పైకి ఎదిగి కుటుంబానికి ఆసరాగా నిలబడాలనే ఆశతో ఎంతో మంది యువత ప్రతీ ఏడాదీ పల్లెటూళ్ల నుంచి సిటీలకు చేరుకుంటారు. నగరాల్లో కెరీర్ పరంగా పైకెదుగుతున్నా, ఆరోగ్యంలో మాత్రం రోజురోజుకూ ప్రమాదంలో పడుతోంది యువత. సిటీ లైఫ్ స్టైల్ ఆరోగ్యాన్ని దెబ్బతీయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. పట్నపు జీవితమనేది పైకి అందంగా కనిపిస్తున్నా, దానితో పాటే ఎన్నో కనిపించని లాంగ్ లైఫ్ ప్రమాదాలు కూడా ఉంటాయి. ఇవి అప్పటికప్పుడు ఏమీ చేయవు. కానీ జీవితంలో ఎక్కడో ఒకసారి తమ పడగ విప్పి ప్రభావం చూపిస్తాయి.

 

 

అన్నింటి కంటే సిటీలో మొదట చెప్పుకోవాల్సింది కాలుష్యమే. ఆ సిటీ ఈ సిటీ అని తేడా లేకుండా, ప్రతీ చోటా వాతావరణాన్ని కాలుష్యపరచడంలో నగరాలు పోటీపడుతున్నాయి. ఇంటి నుంచి బయటికొచ్చి, ఆఫీసులకో లేక కోచింగ్ సెంటర్లకో వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికొచ్చి స్నానం చేసేసరికి, ఒంటికి మసి ఎంతగా పట్టిందో అర్ధమవుతుంది. కళ్లముందే ఆరోగ్యాన్ని కాలుష్యం మెల్లమెల్లగా కబళిస్తోందని తెలిసినా కెరీర్, జీవితం అంటూ తనను తానే కట్టేసుకుని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు నగర వాసి. వాయు కాలుష్యంతో పాటు, అవసరం ఉన్నా లేకపోయినా హారన్లు మోగిస్తూ సౌండ్ చేసే సిటీలోని సెన్స్ లెస్ మనుషుల ధ్వని కాలుష్యం మరో కనబడని కాలనాగు. ఈ శబ్దాల మధ్య అలవాటు అయిపోయిన నగర జీవి చిన్న చిన్న శబ్దాలు వినే శక్తిని కోల్పోతాడనడంలో సందేహం లేదు. ఒక పాతికేళ్ల పాటు నగరాల్లో జీవించిన వ్యక్తి ఊపిరితిత్తుల్ని గమనిస్తే ఈ తేడా ఖచ్చితంగా తెలుస్తుంది.

 

 

నగరజీవనంలో మరో విపత్తు తిండి అలవాట్లు. రోడ్డు మీద ఏది పడితే అది తినడమే కాక, ఇంటికి కూడా కర్రీ పాయింట్స్ నుంచే తెచ్చుకోవడం ఆరోగ్యానికి మరో ప్రమాదకరమైన పని. ఇంట్లో వండుకునే సౌలభ్యం ఉన్నవాళ్ల ఒంటిలో కూడా కూరగాయలకు కొట్టిన రంగులు చేరిపోతున్నాయి. రోడ్డు సైడ్ దుకాణం నుంచి, బ్రాండెడ్ వెజిటబుల్ మార్కెట్స్ వరకూ, అన్నింటిలోనూ రంగులే. కృత్రిమ పదార్ధాలే. సిటీ లైఫ్ లో మనిషి సగటు ఆయుర్దాయం తగ్గిపోవడం వెనుక కనబడని పాత్ర ఈ తిండి అలవాట్లది. ఇక నూడుల్స్, ఫైడ్ రైస్ పాయింట్స్ గురించి, వాటిలో వాడే నూనె గురించి ఎంత తక్కువ చెప్పుకంటే అంత మంచిది.

 

 

తిండి లేకుండా మనిషి బతకగలడు కానీ నిద్ర లేకపోతే మాత్రం శరీరం శుష్కించిపోతుంది. కానీ ఈ వాస్తవం సిటీలైఫ్ లో ఉన్న వారికి అర్ధం కావట్లేదు. గతేడాది చేసిన ఒక సర్వే ప్రకారం, మెట్రో సిటీల్లో రాత్రి నిదురపోయే సమయం సగటు 5 గంటలుగా తేలింది. కనీసం 8 గంటలు పడుకోవాల్సిన మనిషి ఐదారు గంటలు మాత్రమే పడుకుంటే, ఇక శరీరాలు రోగాలబారిన పడకుండా ఎలా ఉంటాయి. నిద్రలేక ఎర్రబడిన కళ్లు ప్రతీ ఉదయాన్న సిటీలో సూర్యుడికి స్వాగతం చెబుతుంటాయి. ఆఫీసుల్లో ఓవర్ టైం కావచ్చు. లేక పార్టీ టైం కావచ్చు. కారణమేదైనా అక్కడ కోల్పోయేది నిద్ర కాదు. ఆరోగ్యం.

 

అభివృద్ధి కోసం, జీవితంలో పైకెదగడం కోసం సిటీకి వచ్చే మనిషి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మాత్రం రోజురోజుకూ ఫలమౌతున్నాడన్నది వాస్తవం. కాదంటారా..?

By
en-us Political News

  
ముఖంపై రోజ్ వాటర్ వాడటం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు, చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి రోజ్ వాటర్ ఎలా ఉపయోగపతుందో ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.
బెండకాయలు తింటే పిల్లలకు లెక్కలు బాగా వస్తాయనే నమ్మకంలో ఎంత నిజం ఉంది? సైన్స్ మరియు నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారు? బెండకాయ వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.
జీవితంలో మనం ఎంచుకునే మార్గం, ఎదుర్కొనే సవాళ్లు మన భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తాయి. ప్రతి రోజూ ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం.
జీవితంలో ఒక్కసారిగా చేతికి డబ్బు రాగానే మనుషుల ప్రవర్తన మారిపోతుంటుంది. రాత్రికి రాత్రే సంపాదించడం మొదలుపెట్టిన చాలామంది కొన్నేళ్లలోనే మళ్లీ మొదటికి వస్తుంటారు.
చైనాలో బరువు తగ్గడం కోసం తొలిసారిగా ఓరల్ జీఎల్పీ 1 మాత్ర ఓర్ఫోగ్లిప్రాన్ ఆమోదం పొందింది. ఎలి లిల్లీ సంస్థకు దక్కిన ఈ చారిత్రాత్మక మైలురాయి, క్లినికల్ ట్రయల్స్ విశేషాలు మరియు భవిష్యత్తు అంచనాల పూర్తి సమాచారం.
వ్యాయామం లేదా శారీరక శ్రమ తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఎందుకు పెరుగుతాయి? కాలేయం పాత్ర, హార్మోన్ల ప్రభావం మరియు మధుమేహం ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తల పూర్తి సమాచారం.
చలికాలంలో పచ్చి బఠానీలు తినడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు, ప్రోటీన్, ఫైబర్ లాభాలు మరియు రోగనిరోధక శక్తిని పెంచే రహస్యాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
వారానికి ఒక్కసారైనా పార్కులకు వెళ్లడం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం ఎంతగా మెరుగుపడుతుందో తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి.
క్యాన్సర్ చికిత్సలో వస్తున్న సరికొత్త వైద్య విప్లవాలు మరియు అత్యాధునిక ట్రీట్‌మెంట్ విధానాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
గుండె జబ్బులు ఉన్నవారికి స్టెంట్‌లు లేదా బైపాస్ సర్జరీలు నిజంగా ప్రాణాలను కాపాడుతాయా? 25 ఏళ్ల సుదీర్ఘ పరిశోధనలో వెల్లడైన సంచలన విషయాలు మరియు వైద్య నిపుణుల హెచ్చరికల పూర్తి సమాచారం.
రోజూ ఒక గ్లాసు బార్లీ నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, బరువు తగ్గడం, షుగర్ మరియు బీపీ నియంత్రణ, కిడ్నీల ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
మానవ సంబంధాలలో ఒకరికొకరు సమయం కేటాయించడం ఎంత ముఖ్యమో, ఎవరి వ్యక్తిగత జీవితానికి వారు కొంత వ్యక్తిగత సమయం లేదా స్పేస్ తీసుకోవడం కూడా అంతే అవసరం.
మనం నిత్య జీవితంలో గమనిస్తే కొందరి దగ్గర డబ్బు బాగా ఉంటుంది కానీ నలుగురిలో వారికి ఎలాంటి గౌరవం దక్కదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.