జీవితంలో నిజమైన విజయం ప్రశాంతత కావాలా.. ఇదిగో ఈ సూత్రాలు పాటించండి.. !

Publish Date:Nov 16, 2026

Advertisement

 జీవితంలో నిజమైన విజయం ప్రశాంతత కావాలా.. ఇదిగో ఈ సూత్రాలు పాటించండి.. !

జీవితంలో మనం ఎంచుకునే మార్గం, ఎదుర్కొనే సవాళ్లు మన భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తాయి. ప్రతి రోజూ ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు మన వ్యక్తిగత జీవితంపైనే కాకుండా మన చుట్టూ ఉన్న సమాజంపై కూడా ఎంతో కొంత ప్రభావాన్ని చూపుతాయి. అందుకే మనం ఏ పనిచేసినా కాస్త ఆలోచించి, సరైన దిశలో అడుగులు వేయడం చాలా ముఖ్యం. ప్రస్తుత టెక్నాలజీ పెరిగిపోయిన డిజిటల్  కాలంలో ఉరుకులు పరుగుల జీవితం వల్ల చాలామంది మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. కెరీర్ ఒత్తిళ్లు, కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత ఆశయాలను చేరుకోవాలనే ఆతురతలో పడి తమ ఆరోగ్యాన్ని ,  మనశ్శాంతిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే  జీవితంలో నిజమైన విజయం సాధించాలన్నా,  ప్రశాంతత కావాలన్నా కొన్ని జీవన సూత్రాలు పాటించాలి.  అప్పుడే హ్యాపీగా ఉండగలుగుతారు.  ఆ జీవన సూత్రాలు ఏమిటో వివరంగా తెలుసుకుంటే..

మానసిక ఆరోగ్యం..

శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మనిషికి చాలా ప్రధానమైనది. రోజూ కొంత సమయాన్ని వ్యాయామం, యోగా లేదా ధ్యానం కోసం కేటాయించడం ద్వారా ఒత్తిడిని దూరంగా ఉంచుకోవచ్చు. అలాగే, మనకు నచ్చిన అలవాట్లను ఇంప్రూవ్ చేసుకోవచ్చు, పుస్తకాలు చదవడం లేదా క్రియేటివిటీ ఫ్రూవ్ చేసుకునే  పనులలో నిమగ్నం కావడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు కుంగిపోకుండా, వాటిని ఒక అనుభవంగా భావించి ముందుకు సాగడమే నిజమైన జీవన శైలి గా భావించాలి.

పాజిటివ్ దృక్పథం..

ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండటం, చుట్టూ ఉన్నవారితో మంచి సంబంధాలు కలిగి ఉండటం మనల్ని మానసికంగా బలంగా మారుస్తుంది. ప్రతి రోజూ కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపాలి. అప్పుడే జీవితంలో ఎదుగుదల సాధ్యమవుతుంది.

ప్రవర్తన..

సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నా, సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలన్నా మన ప్రవర్తన , ఆలోచనా విధానం ఎంతో ముఖ్యం. ఎప్పుడూ అహంకారం, గర్వం,  ఇతరుల పట్ల చిన్న చూపు చూడటం వంటివి అస్సలు చేయకూడదు.

ఇది కూడా చదవండి  చేతికి డబ్బు రాగానే ఈ పనులు చేయండి.. లేకపోతే బాధపడతారు..!

ఆందోళన..

చాలామంది రేపు ఏమవుతుందో అనే భయంతో .. ఆందోళన చెందుతూ ఉంటారు.  దీని వల్ల వర్తమానంలో చేతిలో ఉన్న కాలాన్ని భయపడుతూ, ఆందోళనగా గడిపేస్తారు.  దీని వల్ల ఎలాంటి ప్రశాంతత,  చేయాలనుకున్న పనుల పట్ల ఏకాగ్రత ఉండవు. అందుకే భవిష్యత్తును గురించి అతిగా ఆందోళన చెందకుండా వర్తమానంలో జీవిస్తూ ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి.

                                                                                                                        *రూపశ్రీ.


 

By
en-us Political News

  
జీవితంలో ఒక్కసారిగా చేతికి డబ్బు రాగానే మనుషుల ప్రవర్తన మారిపోతుంటుంది. రాత్రికి రాత్రే సంపాదించడం మొదలుపెట్టిన చాలామంది కొన్నేళ్లలోనే మళ్లీ మొదటికి వస్తుంటారు.
చైనాలో బరువు తగ్గడం కోసం తొలిసారిగా ఓరల్ జీఎల్పీ 1 మాత్ర ఓర్ఫోగ్లిప్రాన్ ఆమోదం పొందింది. ఎలి లిల్లీ సంస్థకు దక్కిన ఈ చారిత్రాత్మక మైలురాయి, క్లినికల్ ట్రయల్స్ విశేషాలు మరియు భవిష్యత్తు అంచనాల పూర్తి సమాచారం.
వ్యాయామం లేదా శారీరక శ్రమ తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఎందుకు పెరుగుతాయి? కాలేయం పాత్ర, హార్మోన్ల ప్రభావం మరియు మధుమేహం ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తల పూర్తి సమాచారం.
చలికాలంలో పచ్చి బఠానీలు తినడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు, ప్రోటీన్, ఫైబర్ లాభాలు మరియు రోగనిరోధక శక్తిని పెంచే రహస్యాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
వారానికి ఒక్కసారైనా పార్కులకు వెళ్లడం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం ఎంతగా మెరుగుపడుతుందో తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి.
క్యాన్సర్ చికిత్సలో వస్తున్న సరికొత్త వైద్య విప్లవాలు మరియు అత్యాధునిక ట్రీట్‌మెంట్ విధానాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
గుండె జబ్బులు ఉన్నవారికి స్టెంట్‌లు లేదా బైపాస్ సర్జరీలు నిజంగా ప్రాణాలను కాపాడుతాయా? 25 ఏళ్ల సుదీర్ఘ పరిశోధనలో వెల్లడైన సంచలన విషయాలు మరియు వైద్య నిపుణుల హెచ్చరికల పూర్తి సమాచారం.
రోజూ ఒక గ్లాసు బార్లీ నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, బరువు తగ్గడం, షుగర్ మరియు బీపీ నియంత్రణ, కిడ్నీల ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
మానవ సంబంధాలలో ఒకరికొకరు సమయం కేటాయించడం ఎంత ముఖ్యమో, ఎవరి వ్యక్తిగత జీవితానికి వారు కొంత వ్యక్తిగత సమయం లేదా స్పేస్ తీసుకోవడం కూడా అంతే అవసరం.
మనం నిత్య జీవితంలో గమనిస్తే కొందరి దగ్గర డబ్బు బాగా ఉంటుంది కానీ నలుగురిలో వారికి ఎలాంటి గౌరవం దక్కదు.
చలికాలంలో క్యాప్సికమ్ తింటే ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటి? మలబద్ధకం నివారణ, బరువు నియంత్రణ మరియు ఇమ్యూనిటీ పెంచడంలో క్యాప్సికమ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.
చలికాలంలో వేడివేడిగా నల్ల శెనగ గుగ్గిళ్లు తింటే కేజీ మటన్, పాలు తాగిన దానికంటే ఎక్కువ శక్తి లభిస్తుంది. నల్ల శెనగల్లోని పోషకాలు, కేలరీలు మరియు ఆరోగ్య లాభాల గురించి పూర్తిగా తెలుసుకోండి.
కంటిచూపును సహజంగా మెరుగుపరచుకోవడానికి, కళ్ళద్దాలను వదిలించుకోవడానికి మునగాకు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి ఎలా సహాయపడతాయో ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.