జీవితంలో డబ్బు, గౌరవం రెండూ కావాలంటే.. ఈ నియమాలు పాటించండి..!

Publish Date:Nov 13, 2026

Advertisement

 జీవితంలో డబ్బు, గౌరవం రెండూ కావాలంటే.. ఈ నియమాలు పాటించండి..!

మనం నిత్య జీవితంలో గమనిస్తే కొందరి దగ్గర డబ్బు బాగా ఉంటుంది కానీ నలుగురిలో వారికి ఎలాంటి గౌరవం దక్కదు. మరికొందరి దగ్గర డబ్బు పెద్దగా లేకపోయినా ప్రతి ఒక్కరూ ఎంతో గౌరవిస్తారు. అయితే నిజ జీవితంలో ఎదుగుదలను కోరుకునే ప్రతి ఒక్కరికీ డబ్బుతో పాటు సమాజంలో మంచి పేరు, గౌరవం కూడా ఉండాలనే ఆశ ఉంటుంది. ఈ రెండు విషయాలను బాలెన్స్  చేసుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎలా చేరుకోవాలో కొన్ని ముఖ్యమైన జీవన నియమాలు మనకు మార్గదర్శకం చేస్తాయి. వీటిని పాటిస్తే జీవితంలో డబ్బు, గౌరవం రెండూ లభిస్తాయి.  అవేంటో  వివరంగా తెలుసుకుంటే..

డబ్బు కంటే మన విలువలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం..

కేవలం అధిక లాభాలు లేదా ఎక్కువ సంపాదన కోసం కస్టమర్లకు లేదా వ్యక్తులకు  అనవసరమైన వస్తువులను అంటగట్టడం, వ్యాపారంలో అబద్ధాలు చెప్పడం వంటి పనులు చేయకూడదు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించినా ఆ సంపాదన ఎక్కువ కాలం నిలబడదు, పైగా నలుగురిలో మన మీద ఉన్న నమ్మకం పోతుంది. ఎంత కష్టపడి సంపాదించినా నిజాయితీ అనే పునాది లేకపోతే ఆ డబ్బుకు ఎలాంటి విలువ ఉండదు. అందుకే ముందుగా విలువలను పెంచుకోవాలి, అలా చేస్తే  ఆటోమేటిక్ గా డబ్బు కూడా  వెనుక వస్తుంది.

మాటకు ఇచ్చే విలువ..

ఎవరికైనా మాట ఇచ్చామంటే అది ఎంత చిన్నదైనా తప్పకుండా  నిలబెట్టుకోవాలి. చేయలేని పనులకు తొందరపడి వాగ్దానాలు చేయడం, మాట తప్పడం వల్ల మనుషుల మధ్య నమ్మకం పూర్తిగా సడలిపోతుంది. నోటి నుంచి వచ్చే మాట మన దగ్గర ఉన్న డబ్బు  కంటే ఎంతో విలువైనది. తక్కువగా మాట్లాడినా పర్వాలేదు కానీ ఇచ్చిన మాట మీద నిలబడే తత్త్వాన్ని అలవాటు చేసుకుంటే సమాజంలో మనపై ఎంతో  గౌరవం పెరుగుతుంది.

సంపాదించడం ఎంత ముఖ్యమో, పొదుపు చేయడం అంతకంటే ముఖ్యం..

చేతికి డబ్బు రాగానే వచ్చిన వెంటనే అనవసరమైన విలాసాలకు, ఖరీదైన వస్తువులకు ఖర్చు పెట్టేయడం సరైన పద్ధతి కాదు. జీవితంలో ఎప్పుడైనా అనుకోని ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఆ సమయంలో మనల్ని ఆదుకునేది మనం చేసిన పొదుపే. అందుకే ఆదాయాన్ని కుటుంబ అవసరాలు, వ్యాపార పెట్టుబడులు , పొదుపుగా విభజించుకుని తెలివిగా నిర్వహించడం నేర్చుకోవాలి. డబ్బు మనకోసం పనిచేసేలా చూసుకోవాలి తప్ప మనం డబ్బుకోసం పరిగెత్తకూడదు.

ఇది కూడా చదవండి   పిల్లలు తల్లిదండ్రులతో అన్ని విషయాలు షేర్ చేసుకోవాలంటే.. ఇదిగో ఇలా పెంచండి..!

ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలని ప్రయత్నించడం..

మనం ఎంత మంచివారైనా, ఎంత నిజాయితీగా ఉన్నా కొందరు విమర్శిస్తూనే ఉంటారు. అలాంటి అనవసరమైన విమర్శల గురించి ఆలోచిస్తూ మన లక్ష్యాలను విస్మరించకూడదు. నిజమైన విమర్శ ఏదో గమనించి దాని నుంచి నేర్చుకోవాలి, అసూయతో వచ్చే మాటలను పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. అందరి అప్రూవల్ కోసం కాకుండా మన విలువల పట్ల మనమే నిజాయితీగా ఉండాలి.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి.. సహాయం చేసిన వారిని మరవకూడదు..

జీవితంలో కష్టకాలంలో ఉన్నప్పుడు మన వెన్నంటి   నిలబడిన వారిని గుర్తుంచుకోవాలి. మనం ఆర్థికంగా స్థిరపడిన తర్వాత మన చుట్టూ ఉన్న తోటివారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి చేతనైనంత సహాయం చేయాలి. నిజమైన సంపద మన దగ్గర ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనేది కాదు, మన వల్ల ఎంతమంది జీవితాలు మారాయనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.

తెలుసుకోవాల్సిన అసలు విషయం..

 డబ్బు మాత్రమే ఉండి అహంకారం ఉంటే దానికి విలువ ఉండదు. అలాగే గౌరవం ఒక్కటే ఉండి జీవన ప్రమాణాలు లేకపోయినా ఇబ్బందే. ఈ రెండు సమపాళ్లలో దక్కాలంటే నైపుణ్యంతో పాటు మంచి వ్యక్తిత్వాన్ని, క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలి. మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు డబ్బు సంపాదించానని, కానీ దానికోసం నా విలువలను కోల్పోలేదని గర్వంగా చెప్పుకునేలా బతకడమే అసలైన విజయం.

                                                                                                                                            *రూపశ్రీ.

 

మీకు నచ్చవచ్చు  ఇలాంటి కొడుకు ఒక్కడుంటే చాలు.. కుటుంబం నిశ్చింతగా ఉండొచ్చు..!

                              మొహమాటం కొద్దీ అందరి ముందూ తలూపుతూ ఉంటారా.!

By
en-us Political News

  
చైనాలో బరువు తగ్గడం కోసం తొలిసారిగా ఓరల్ జీఎల్పీ 1 మాత్ర ఓర్ఫోగ్లిప్రాన్ ఆమోదం పొందింది. ఎలి లిల్లీ సంస్థకు దక్కిన ఈ చారిత్రాత్మక మైలురాయి, క్లినికల్ ట్రయల్స్ విశేషాలు మరియు భవిష్యత్తు అంచనాల పూర్తి సమాచారం.
వ్యాయామం లేదా శారీరక శ్రమ తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఎందుకు పెరుగుతాయి? కాలేయం పాత్ర, హార్మోన్ల ప్రభావం మరియు మధుమేహం ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తల పూర్తి సమాచారం.
చలికాలంలో పచ్చి బఠానీలు తినడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు, ప్రోటీన్, ఫైబర్ లాభాలు మరియు రోగనిరోధక శక్తిని పెంచే రహస్యాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
వారానికి ఒక్కసారైనా పార్కులకు వెళ్లడం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం ఎంతగా మెరుగుపడుతుందో తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి.
క్యాన్సర్ చికిత్సలో వస్తున్న సరికొత్త వైద్య విప్లవాలు మరియు అత్యాధునిక ట్రీట్‌మెంట్ విధానాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
గుండె జబ్బులు ఉన్నవారికి స్టెంట్‌లు లేదా బైపాస్ సర్జరీలు నిజంగా ప్రాణాలను కాపాడుతాయా? 25 ఏళ్ల సుదీర్ఘ పరిశోధనలో వెల్లడైన సంచలన విషయాలు మరియు వైద్య నిపుణుల హెచ్చరికల పూర్తి సమాచారం.
రోజూ ఒక గ్లాసు బార్లీ నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, బరువు తగ్గడం, షుగర్ మరియు బీపీ నియంత్రణ, కిడ్నీల ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
మానవ సంబంధాలలో ఒకరికొకరు సమయం కేటాయించడం ఎంత ముఖ్యమో, ఎవరి వ్యక్తిగత జీవితానికి వారు కొంత వ్యక్తిగత సమయం లేదా స్పేస్ తీసుకోవడం కూడా అంతే అవసరం.
చలికాలంలో క్యాప్సికమ్ తింటే ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటి? మలబద్ధకం నివారణ, బరువు నియంత్రణ మరియు ఇమ్యూనిటీ పెంచడంలో క్యాప్సికమ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.
చలికాలంలో వేడివేడిగా నల్ల శెనగ గుగ్గిళ్లు తింటే కేజీ మటన్, పాలు తాగిన దానికంటే ఎక్కువ శక్తి లభిస్తుంది. నల్ల శెనగల్లోని పోషకాలు, కేలరీలు మరియు ఆరోగ్య లాభాల గురించి పూర్తిగా తెలుసుకోండి.
కంటిచూపును సహజంగా మెరుగుపరచుకోవడానికి, కళ్ళద్దాలను వదిలించుకోవడానికి మునగాకు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి ఎలా సహాయపడతాయో ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
చలికాలంలో వేడివేడిగా తినుటకు అనువైన క్రిస్పీ క్యాప్సికం బజ్జీల తయారీ విధానం మరియు వాటి ఆరోగ్య ప్రయోజనాల పూర్తి సమాచారం.
పచ్చిబొప్పాయి తింటే ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటి? జీర్ణక్రియ మెరుగుదల, బరువు తగ్గడం, చర్మ సంరక్షణ మరియు కంటి చూపు వంటి అసాధారణ లాభాల గురించి పూర్తిగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.