న్యూ ఇయర్ రిజల్యూషన్.. కొత్త ఏడాది నిర్ణయాల్లో తప్పనిసరిగా ఉండాల్సిన విషయమిదే..!

Publish Date:Dec 31, 2024

Advertisement

 

కొత్త.. అనే పేరులోనే చాలా గొప్ప ఆశావాదం ఉంటుంది.  కొత్త దనం ఎప్పుడూ మంచే చేస్తుందనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది.  ఈ పాజిటివ్ ఆలోచన వల్లనే చాలామంది కొత్తదనం అంటే ఆసక్తిగా ఉంటారు. కొత్తదనం అంటే జీవితానికి బోనస్ లాంటిది.   అయితే కొత్తగా మొదలు పెట్టేది ఏదైనా సరే జీవితానికి మేలు చేసేది అయి ఉండాలి. ఏ పని చేయాలన్నా దానికి ఓ పద్దతి, పాడు ఉంటుంది.  ముఖ్యంగా ఏ పని చేయాలన్నా దానికి తగిన ఆలోచనా విధానం,  శరీర ఆరోగ్యం సహకరించాలి. ఇవి రెండూ లేకపోతే ఏ పని అయినా సమర్థవంతంగా చేయలేరు.  అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.  కొత్త ఏడాది తీసుకునే నిర్ణయాలు ఏవైనా కానివ్వండి.. అది ఎంత గొప్పది అయినా కానివ్వండి.. వాటిలో ముందు వరుసలో.. మొట్టమొదటగా ఉండాల్సినది ఆరోగ్య రక్షణ.  కొత్త ఏడాది చాలా మంది తీసుకునే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ లో ఆరోగ్యం కు సంబంధించి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.  ఇంతకీ ఈ కొత్త ఏడాదిలో అయినా ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన నిర్ణయాలను గూర్చి తెలుసుకుంటే..

 మంచి ఆరోగ్యం సంపాదించానే నిర్ణయం తీసుకోవడం  భవిష్యత్తులో అనేక రకాల వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది. మంచి ఆరోగ్యం ఉంటేనే జీవితంలో ఏదైనా చేయగలం అని  ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ మధ్యకాలంలో  కనిపించే అన్ని వ్యాధులలో ఒక విషయం సర్వసాధారణంగా చెబుతున్నారు. అదే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం.  రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారిలో తీవ్రమైన జబ్బులు  వచ్చే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్యం బాగుండాలంటే కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలి.


బరువు..

బరువు తగ్గడం  మెరుగైన ఆరోగ్యానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన దశల్లో ఒకటి.  శరీర బరువులో కేవలం ఐదు నుండి పది శాతం తగ్గడం వల్ల గుండె జబ్బులు, టైప్-2 మధుమేహం,  అధిక రక్తపోటు వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులను నివారించవచ్చు. బరువు తగ్గాలంటే రోజూ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే అలవాటు ఇందులో చాలా ముఖ్యమైనది.  బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా అనేక  వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడే కొన్ని ప్రత్యేక ఆహారాలను కూడా అనుసరించవచ్చు.

కొత్త సంవత్సరంలో మంచి ఆరోగ్యాన్ని పొందాలనుకుంటే ఆహారాన్ని మెరుగుపరచడంపై శ్రద్ధ పెట్టాలి . ఆరోగ్యకరమైన ఆహారం అంటే  ఏమి తింటారు,  ఎలా తింటారని అర్థం. ప్రతి రోజు  ఆహారంలో పండ్లు,  కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. పండ్లు,  కూరగాయలలో తక్కువ కేలరీలు,  ఫైబర్, విటమిన్లు,  ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటాయి.  కొత్త ఏడాది సందర్భంగా ఆహారంలో పండ్లు, కూరగాయలు తప్పకుండా ఎక్కువ మోతాదులో ఉండేలా చూసుకుంటామని ఎవరికి వారు వాగ్దానం చేసుకోవాలి.

 పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు కొలెస్ట్రాల్,  షుగర్ పెరగకుండా నిరోధిస్తాయి. అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడే ఆకుపచ్చ కూరగాయలతో పాటు నట్స్,  విత్తనాలను ఆహారంలో చేర్చడం ద్వారా యాంటీఆక్సిడెంట్లను పొందవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న వ్యాధులకు శారీరక నిష్క్రియాత్మకత ప్రధాన కారణమని చాలా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి . రోజులో ఎక్కువ సమయం కూర్చొని లేదా విశ్రాంతి తీసుకునే వ్యక్తులు నడుస్తూ ఉండే వ్యక్తుల కంటే రక్తపోటు, కొలెస్ట్రాల్,  మధుమేహం మొదలైన అనేక ఆరోగ్య రుగ్మతలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, 2025 సంవత్సరంలో మీ దినచర్యలో - తక్కువగా కూర్చోవడం -ఎక్కువగా నడవడం అనే విషయాన్ని చేర్చుకోవాలి. దీన్ని ఆచరణలో ఉంచాలి కూడా.

రోజువారీ జీవితంలో శారీరక శ్రమను పెంచడం లక్ష్యంగా పెట్టుకోవాలి. లిఫ్ట్‌కు బదులుగా మెట్లను ఉపయోగించడం, దగ్గరగా ఉన్న ప్రదేశాలకు డ్రైవింగ్ చేయడానికి బదులుగా నడుచుకుంటూ వెళ్లడం. మీరు రోజంతా ఆఫీసులో ఉంటే అప్పుడప్పుడు సీట్ నుండి లేచి నడవడం వంటివి చేయాలి. ఈ అలవాటు  ఆరోగ్యంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి సహాయపడుతుంది.

ఆరోగ్య పరీక్షలు..

చాలా ఆరోగ్యం బానే ఉందిగా మళ్ళీ పరీక్షలకు డబ్బులు దండగ అనే ఆలోచనలో ఉంటారు. అయితే ఆరోగ్య పరీక్షలు జబ్బుల ఉనికిని ముందుగానే గుర్తిస్తాయి.  దీనివల్ల ఒకరిగేది ఏంటంటే.. శరీరం ఎక్కువ బాధపడకుండా.. ఎక్కువ నష్టం జరగకుండా చూసుకోవడం.  సమస్య పెద్దది అయ్యాక వైద్యం కోసం చేయాల్సిన ఖర్చులో కనీసం 10శాతం ఖర్చులు పెట్టి ముందుగానే పరీక్షలు చేయించుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఇంట్లో షుగర్,  రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవచ్చు.  దీని కోసం ఇంట్లో సదరు పరికరాలు ఇంట్లోనే ఉంచుకోవచ్చు. శరీర స్థితికి తగ్గట్టు ఏ పరీక్షలు అవసరమో   ఆరోగ్యానికి అనుగుణంగా ఏ పరీక్షలు చేయించుకోవాలో అనే విషయాన్నివైద్యుల సలహాతో తెలుసుకోవాలి.  ఆరోగ్యాన్ని సంపాదించుకునే పనిలో ఈ కొత్త ఏడాది మరింత మెరుగ్గా ఉండాలి.


                                           *రూపశ్రీ.

By
en-us Political News

  
దీపావళిలో టపాసులు పేలేటప్పుడు కంటికి గాయాలైతే తీసుకోవాల్సిన అత్యవసర జాగ్రత్తలు మరియు ప్రథమ చికిత్స గురించి తెలుసుకోండి.
బేరి పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి. గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ మెరుగుదల, బరువు నియంత్రణ మరియు మధుమేహం అదుపులో పియర్ ఫ్రూట్ ఎలా సహాయపడుతుందో పూర్తి వివరాలు.
అన్నాన్ని ఫ్రిజ్‌లో పెట్టి మళ్లీ వేడి చేసి తింటున్నారా? రీహీటెడ్ రైస్ వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం మరియు పాటించాల్సిన 24 గంటల రూల్ గురించిన పూర్తి వివరాలు.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏ వంట నూనెలు ఉత్తమమైనవి? కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండటానికి నూనెలను ఏ విధంగా వాడాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.
కళ్ల కింద డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధపడుతున్నారా? మార్కెట్ క్రీమ్స్‌కు బదులుగా 800 ఏళ్ల నాటి ఆయుర్వేద నిపుణులు సూచించిన జాజికాయ, ములేఠీ పేస్ట్ చిట్కాతో సహజంగా మెరిసే కళ్లను సొంతం చేసుకోండి.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి, డయాబెటిస్ ముప్పును నివారించడానికి కార్డియాలజిస్ట్ హెచ్చరిస్తున్న 4 హానికరమైన ఆహార పదార్థాల గురించి తెలుసుకోండి.
మినుములు లేదా మినప్పప్పు ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తాయో తెలుసా? ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్ మరియు కాల్షియం సమృద్ధిగా ఉండే మినుములు జీర్ణక్రియను మెరుగుపరుస్తూ, ఎముకలను బలంగా మార్చి, కీళ్ల నొప్పులు మరియు ఉబ్బసానికి ఎలా చెక్ పెడతాయో ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
నడుము నొప్పితో బాధపడుతున్నారా? వెన్నెముకను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి మరియు నడుము నొప్పిని తగ్గించడానికి పాటించవలసిన 5 అత్యవసరమైన ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
మానవ శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీలు కాదంటూ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధనలు సంచలన విషయాలు వెల్లడించాయి. సగటు ఉష్ణోగ్రత ఎందుకు తగ్గుతుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
దీపావళి బాణసంచా పొగ వల్ల ఆస్తమా మరియు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ఎలా జాగ్రత్తపడాలో తెలుసుకోండి. N95 మాస్క్ వినియోగం, AQI తనిఖీ మరియు తీసుకోవాల్సిన హెల్త్ టిప్స్.
ప్రకృతి సృష్టించే అత్యంత భయంకరమైన , విధ్వంసకరమైన ముప్పులలో సునామీ ఒకటి. సముద్ర గర్భంలో సంభవించే భూకంపాలు లేదా అల్లకల్లోలాల కారణంగా ఉద్భవించే ఈ రాక్షస అలలు క్షణాల్లో తీర ప్రాంతాలను ముంచెత్తుతాయి.
ధంతేరస్ నుంచి దీపావళి వరకు ఏ రోజు ఏ వస్తువులు కొనుగోలు చేయాలి? బంగారం, వెండి, పాత్రలతో పాటు ఏది శుభప్రదం? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మానవ ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఆధునిక పోషకాహార ఫ్రేమ్‌వర్క్ తెస్తున్న విప్లవాత్మక మార్పులు, ప్రయోజనాల గురించిన పూర్తి సమగ్ర విశేషాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.