పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి..!

Publish Date:Feb 22, 2025

Advertisement

 

వివాహం  తర్వాత అబ్బాయి,  అమ్మాయి జీవితం పూర్తిగా మారిపోతుంది. దీన్ని జన్మజన్మల బంధం అంటారు.  దీనికి తగినట్టు భార్యాభర్తలు ఇద్దరూ వివాహం తరువాత అన్యోన్యంగా లేకపోయినా.. ఏవైనా విషయాలలో ఇబ్బందులు, అపార్థాలు తలెత్తినా ఆ బందం చాలా క్లిష్టంగా మారుతుంది.  వివాహ సంబంధంలో భాగస్వామి మద్దతు ఇవ్వకపోతే ఆ సంబంధాన్ని కొనసాగించడం చాలా కష్టమవుతుంది. కుటుంబ సభ్యుల ఇష్టానుసారం పెద్దలు కుదిర్చిన వివాహం జరగడంలో చాలా వరకు పెద్దల ఇష్టం.. ఇరు కుటుంబాల ప్రయోజనాలు అన్నీ దృష్టిలో ఉంటాయి. కానీ కలిసి జీవించాల్సిన భార్యాభర్తలు మాత్రం ఇబ్బందులలో ఇరుక్కుపోతారు. కేవలం అమ్మాయి,  అబ్బాయి ఒకరినొకరు చూసుకుని ఇష్టపడితే సరిపోదు. చాలా విషయాలలో స్పష్టత అవసరం అవుతుంది.  జీవితంలో తీసుకునే అతి ముఖ్యమైన నిర్ణయాలలో వివాహం ఒకటి. అందుకే ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే బదులు తెలివిగా వ్యవహరించడం ముఖ్యం.

పెళ్లికి ముందు..

ప్రతి వ్యక్తి,  కుటుంబం భిన్నంగా ఉంటారు. కాబట్టి కుటంబాలను,  అమ్మాయి లేదా అబ్బాయిని పలుమార్లు కలవడం చాలా ముఖ్యం. అయితే చాలా వరకు కేవలం ఒకసారి అటువైపు వారు, ఇటువైపు వారు ఒకరింటికి ఒకరు వెళ్లి విషయాలు మాట్లాడుకుని పెళ్లి ఖాయం చేసుకుంటారు. కానీ  పెళ్లి చేయాలని అనుకున్న తరువాత తొందర పడకుండా  3 నుండి 5 సార్లు ఒకరింటిని మరొకరు సందర్శించడం చాలా మంచిది. ఇది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి,  కుటుంబాలను తెలుసుకోవడానికి,  ఒకరినొకరు తెలుసుకోవడానికి సహాయపడుతుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకునేవారు ఒక్కసారి కుటుంబాలను, ఇళ్లను చూసి పెళ్లి ఖాయం చేసుకోవద్దు. ఇది ఇబ్బందులనే కాదు.. మోసాన్ని కూడా  వెంటబెట్టుకుని ఉంటుంది.

మొదటిసారి పరిచయాలు చేసుకోవడం, అబ్బాయి లేదా అమ్మాయి విద్య,  ఉద్యోగం, కుటుంబం గురించి మాట్లాడటం,  వారి ఆసక్తులు, అభిరుచులు,  నచ్చినవి, నచ్చినవి అన్ని తెలుసుకోవాలి.  వీలైతే పెద్దల అనుమతి తీసుకుని అమ్మాయి, అబ్బాయి ఏకాంతంగా మాట్లాడుకోవడం మంచిది. చాలా మంది పెద్దలు అమ్మాయి, అబ్బాయి ఒకటైతే తరువాత వారే అన్నింటికి అడ్జస్ట్ అయిపోతారు అని అంటుంటారు. కానీ అది చాలా తప్పు.   ఇద్దరూ అపార్థాలు చేసుకుంటే బంధం అస్సలు నిలబడదు.

రెండవ సారి కలిసినప్పుడు అమ్మాయికి, అబ్బాయికి జీవితం గురించి ఉండే లక్ష్యాలు, నెరవేర్చుకోవాలని అనుకునే కలలు,  కెరీర్,  ప్రణాళికలు, జీవనసైలి, భవిష్యత్తు గురించి ఉన్న ఆలోచనలు అన్నింటి గురించి మాట్లాడుకోవాలి. కుటుంబ విలువలు, సాంప్రదాల గురించి,  వివాహం తరువాత రెండు కుటుంబాల గురించి ఇద్దరూ నడుచుకోవలసిన విధానం గురించి మాట్లాడుకోవాలి.  చాలామంది పెళ్లి తర్వాత ఆడపిల్ల ఇంటికి ప్రాముఖ్యత అవసరం లేదని అనుకుంటారు. కానీ ఇది అమ్మాయిని చాలా బాధపెడుతుంది.  అలాగే పండుగలు, ఆచారాల గురించి కూడా తెలుసుకోవాలి.

మూడవసారి ఇద్దరూ ఒకరికి ఒకరు ఎంత ప్రాధాన్యత ఇస్తారు.  ఇద్దరి మధ్య ఎంతవరకు సమన్వయం కుదిరింది వంటి విషయాలు అర్థం చేసుకోవాలి. ఇద్దరూ మాట్లాడుకొనేటప్పుడు ఒకరిని మరొకరు ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది ముఖ్యం. రెండు వైపులా కుటుంబాలు,  స్నేహితులు మొదలైన విషయాలు కూడా కీలకపాత్ర పోషిస్తాయి.

నాలుగవ సారి కలిసినప్పుడు బాధ్యతల గురించి, అంచనాల గురించి. ఆర్థిక విషయాల గురించ, భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికల గురించి. భాగస్వామికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత గురించి.. ఇలా అన్నీ తెలుసుకుంటూ ఉండాలి.

రెండు వైపులా కుటుంబాలు ముందే చెప్పకుండా కూడా ఒకరి కుటుంబాన్ని మరొక కుటుంబం కలవచ్చు. దీనివల్ల కుటుంబాల ప్రాధాన్యతలు అర్థం అవుతాయి. వివాహ బంధం కుదుర్చుకోవడానికి ఏదైనా సంశయం అనిపిస్తే ఎలాంటి  మొహమాటానికి పోకుండా నిజాయితీగా  సమస్యను చెప్పి సంబంధం విడిచిపెట్టడం లేదా.. సమస్య పరిష్కారానికి ముందే సరైన ప్రణాళిక చేయడం ముఖ్యం.  ఇలా అన్ని విధాలా అన్ని సార్లు కలిసి మాట్లాడుకున్న తరువాతే సంబంధాలు ఖాయం చేసుకోవడం మంచిది. లేకపోతే నేటి కాలపు తొందరపాట్ల వల్ల పెళ్లి అనేది మూణ్ణాళ్ల ముచ్చట అవుతుంది.

                                  *రూపశ్రీ.
 

By
en-us Political News

  
ఫిబ్రవరి, మార్చి నెలలు వచ్చాయంటే చాలు.. విద్యార్థుల్లో ఒక రకమైన తెలియని ఆందోళన మొదలవుతుంది. ఇంటర్, టెన్త్ క్లాస్ పరీక్షలు దగ్గర పడుతుంటే, ఎంత చదివినా ఏదో వెలితి, చదివింది మర్చిపోతున్నామనే భయం చాలా మందిని వెంటాడుతుంటుంది. కేవలం విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు...
నేటి సమాజంలో పెళ్లి అనేది కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు, అది ఇద్దరు వ్యక్తుల జీవితకాల ప్రయాణం. అయితే, మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనలు, వారి భయాలు కూడా మారుతున్నాయి...
ఎలాంటి సంబంధం అయినా సరే.. ప్రతి సంబంధంలో ఏదో ఒక రకమైన గొడవ, సంఘర్షణ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో చాలా సాధారణం. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో గొడవలు కూడా చాలా ఉంటాయి...
ప్రతి తల్లిదండ్రులకి తమ పిల్లల పెళ్లిని కళ్లారా చూడాలని, ఆ వేడుకలో భాగం కావాలని ఒక పెద్ద కల ఉంటుంది. కానీ, ఒక రోజు మీ పిల్లలు "నాకు ఇప్పుడే పెళ్లి వద్దు" లేదా "నేను పెళ్లికి రెడీగా లేను" అని చెబితే, ఆ మాట వినగానే మనసు ముక్కలవుతుంది. కోపం, బాధ, ఆందోళన కలగడం సహజం...
ఆదివారం అనే మాట వినగానే మన ముఖాల్లో సంతోషకరమైన చిరునవ్వు వస్తుంది. ఇది కుటుంబంతో సమయం గడపడానికి,  పని నుండి విరామం తీసుకోవడానికి కేటాయించబడిన రోజుగా పరిగణిస్తారు...
వేగంగా మారుతున్న  జీవనశైలి,  డిజిటల్ యుగంలో పేరెంటింగ్ పద్ధతులు కూడా మారుతున్నాయి. అలాంటి ఒక కొత్త ట్రెండ్ ఇప్పుడు చాలా చర్చించబడుతోంది...
పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒప్పందం కాదు; అది రెండు కుటుంబాల కలయిక, రెండు జీవితాల మేళవింపు. కానీ నేటి కాలంలో సంబంధం చూసేటప్పుడు మనం కేవలం ఆస్తులు, అంతస్తులు లేదా...
ఏ బంధం అయినా నిలబడటానికి పరస్పర అవగాహన చాలా ముఖ్యం. అందులో భార్యాభర్తల బంధం మరీ సున్నితమైనది. కానీ ఆ బంధాన్ని ఎంత దృఢంగా మార్చుకుంటారు అనేదే ఇక్కడ ముఖ్యం.  భార్యాభర్తల బంధం బలంగా మారడానికి పరస్పర అవగాహన చాలా ముఖ్యం...
నేటి కాలంలో ప్రజల ఉద్దేశాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. బయటకు ఒకటి చెబుతారు, కానీ తరువాత వారు చేసేది మరొకటి ఉంటుంది. దీని వలన ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం కష్టమవుతుంది...
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు.  ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు.  కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి...
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు.  ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు...
ప్రతి వ్యక్తి జీవితం గురించి చాలా ఆలోచిస్తారు.  తమ జీవితం ఎలా ఉండాలో,  ఎలా ఉంటే బాగుంటుందో అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.  సరిగ్గా గమనిస్తే.. కొందరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అంటూ ఉంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.