అనుమతులు లేకుండానే చైనాలో యాపిల్ కొత్త ఫీచర్లు!

Publish Date:Apr 1, 2026

Advertisement

 ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన వినియోగదారుల కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన యాపిల్ ఇంటెలిజెన్స్'ఫీచర్లు చైనాలో  అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. అధికారికంగా  రెగ్యులేటరీ అనుమతులు రాకుండానే.. చైనాలోని కొంతమంది ఐఫోన్ వినియోగదారులకు యాపిల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు అందుబాటులోకి రావడం కలకలం సృష్టించింది. సాంకేతిక లోపం కారణంగానే ఇలా జరిగిందని యాపిల్ చెబుతోంది. వెంటనే ఈ సేవలను నిలిపివేసినట్లు పేర్కొంది.  

ఇంతకీ అసలేం జరిగిందంటే.. చైనాలోని కొంతమంది ఐఫోన్ యూజర్లు తమ ఫోన్ సెట్టింగ్స్‌లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ఆక్టివేట్ అయినట్లు గుర్తించారు. వెంటనే దీనికి సంబంధించిన   స్క్రీన్ షాట్లు సోషల్ మీడియా పోస్టు చేశారు. వెంటనే అవి తెగ వైరల్ అయ్యాయి.  విదేశీ ఏఐ సాంకేతికతపై చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలులో ఉన్నా.. ఎటువంటి అనుమతులూ లేకుండా  ఈ ఫీచర్లు ఎలా వచ్చాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింద.  

వాస్తవానికి చైనా మార్కెట్ కోసం యాపిల్ సంస్థ స్థానిక టెక్ దిగ్గజం  అలీబాబాతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ హువావే, షావోమీ వంటి స్థానిక కంపెనీలు ఇప్పటికే ఏఐ ఫీచర్లతో దూసుకుపోతుండటంతో.. అక్కడి మార్కెట్ లో యాపిల్ తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే త్వరగా సేవలు ప్రారంభించాలనే ఉద్దేంతో ఉంది. అయితే తాజాగా అనుమతులు లేకుండానే కొందరి ఫోన్లలో యాపిల్ ఏఐ ఫీచర్లు యాక్టివేట్ కావడం ఆ సంస్థకు పెద్ద ఇబ్బందిగా పరిణమించింది. టెక్నికల్ లోపంగా చెప్పి యాపిల్ ఆ సేవలను చైనాలో నిలిపివేసినప్పటికీ మార్కెటింగ్ పరంగా యాపిల్ చైనాలో కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.  

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో గత ఏడాది నుంచే యాపిల్  ఏఐ సేవలు అందుబాటులో ఉన్నాయి.  చైనాలో మాత్రం చట్టపరమైన చిక్కుల వల్ల ఇంకా అందుబాటులోకి రాలేదు.    చైనాలో ఎదురవుతున్న ఈ రెగ్యులేటరీ అడ్డంకులను తొలగించుకుని,  ఏఐ సేవలను యాపిల్ చైనాలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి ఇప్పుడు మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. యాపిల్ టెక్నికల్ ఎర్రర్ అని చెప్పినప్పటికీ ఈ విషయాన్ని చైనా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందంటున్నారు.  

By
en-us Political News

  
భారతదేశంలో విద్యా వ్యవస్థకు సంబంధించిన ఒక సంచలన వివాదం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల నవ్యాంధ్రకు రెండు పెద్ద దెబ్బలు తగిలాయని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
మండిపోతున్న ఎండలు, వడగాల్పులు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది.
హైదరాబాద్ నగరంలో 14 సంవత్సరాలుగా పోలీసుల కన్నుగప్పి తిరుగుతున్న సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన
యువత అంకితభావం, సమష్టి కృషి, త్యాగం అలవర్చుకోవాలని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, విద్యా-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు మహానాడు వేడుకలు అట్టహాసంగా జరుగుతుంటే, మరోవైపు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఎన్టీఆర్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే, ఐటీ నిరుద్యోగులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అమీర్‌పేట్ మైత్రీవనం జంక్షన్ వద్ద దివంగత నేత ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు.
రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డును (యూనిఫైడ్ కార్డ్ ) రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ర్ణాటక రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ ఎంతగానో అభివృద్ధి చెందుతోంది.
ప్రపంచానికే తలమానికంగా నిలిచేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని మంత్రి పొంగులేటి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పక్కన ఒక ట్రాన్స్‌జెండర్ కూర్చుని ముచ్చటిస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడమే కాదు.. పార్టీ క్యాడర్ నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురుస్తొంది.
తాజాగా ఈడీ పిలుపు మేరకు విజయసాయి గురువారం మరో సారి విచారణకు హాజరయ్యారు.
తన జట్టు ఓడిపోవడంతో స్టాండ్స్‌లో కూర్చున్న సన్‌రైజర్స్ కో-ఓనర్ కావ్య మారన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మైదానంలోనే ఆమె కన్నీటి పర్యంతమైన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యారు. అయితే ఆ తరువాత కావ్యామారన్ ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తికి క్రీడాభిమానులు ఫిదా అయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.