దేశంలోనే నంబర్ వన్ హైదరాబాద్!

Publish Date:Apr 1, 2026

Advertisement

 విశ్వనగరం భాగ్యనగరం  దేశంలోనే అత్యంత అనుకూల నివాసనగరంగా ఖ్యాతి దక్కించుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాలన్నిటినీ  వెనక్కి నెట్టి, అత్యంత అనుకూల నివాసయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ప్రముఖ సంస్థ తాజాగా విడుదల చేసిన  వి ఆర్ సిటీ - 2026'   నివేదిక  మేరకు  దేశంలో అత్యంత అనుకూల నివాసనగరంలో హైదరాబాద్ టాప్ ప్లేస్ దక్కించుకుంది.  

పర్యావరణం, జీవన ప్రమాణాలు,   ఆర్థిక వృద్ధి కారణంగా విశ్వనగరం  కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది.  మౌలిక సదుపాయాల కల్పన, శాంతిభద్రతలు, రవాణా సౌకర్యాలు, ఉపాధి అవకాశాల  ప్రాతిపదికగా ఈ నివేదిక రూపొందింది. గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఐటీ రంగం విస్తరణతో పాటు  స్టార్టప్‌లకు కేంద్రంగా మారడం నగర రూపురేకలను మార్చేసింది.  నిరంతర విద్యుత్ సరఫరా,  తాగునీటి వసతులు ప్రజల జీవనశైలిని మెరుగుపరిచాయని వీఆర్ సిటీ 2026 నివేదిక పేర్కొంది

దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, ఐటీ క్యాపిటల్ బెంగళూరు వంటి ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో నివసించడానికి అయ్యే ఖర్చు   సామాన్యులకు అందుబాటులో ఉండటం అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉండటం కూడా ఈ నగరం అత్యంత అనుకూల నివాసయోగ్యమైన నగరంగా నిలవడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.  ఇక పోతే ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు నిర్మించిన ఫ్లైఓవర్లు, మెట్రో రైలు విస్తరణ, లింక్ రోడ్లు కూడా హైదరాబాద్ ను అత్యంత అనుకూల నివాసయోగ్య నగరంగా మార్చాయి. 

అలాగే  నగరం ఇప్పటికే ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్  గుర్తింపు పొందింది.  పర్యావరణ పరిరక్షణలోనూ ముందుంది. గాలి నాణ్యత విషయంలోనూ ఇతర మెట్రో నగరాల కంటే హైదరాబాద్ మెరుగ్గా ఉంది. ఇక పోతే  విద్య, వైద్య రంగాల్లో హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ వెరసి హైదరాబాద్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. కాగా హైదరాబాద్ మహానగరానికి ఈ గుర్తింపు రావడం వరుసగా ఇది ఆరోసారి.  ఈ  గుర్తింపుతో హైదరాబాద్ కు విదేశీ పెట్టుబడులు మరింతగా పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ గ్లోబల్ ఇండస్ట్రియల్ ఇన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన రాయదుర్గ్ ఇ-వేలం తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త చరిత్ర సృష్టించింది.
ఎన్టీఆర్ ప్రాంతీయ నేత కాదు..యావత్ తెలుగుజాతి గర్వించదగిన బిడ్డ..
సాఫ్ట్‌వేర్ రంగంలో ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నప్పటికీ, మట్టి వాసనపై ఉన్న మక్కువతో ఆ ఐటీ ఉద్యోగాన్ని వదిలేశాడు.
భారతదేశంలో విద్యా వ్యవస్థకు సంబంధించిన ఒక సంచలన వివాదం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల నవ్యాంధ్రకు రెండు పెద్ద దెబ్బలు తగిలాయని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
మండిపోతున్న ఎండలు, వడగాల్పులు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది.
హైదరాబాద్ నగరంలో 14 సంవత్సరాలుగా పోలీసుల కన్నుగప్పి తిరుగుతున్న సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన
యువత అంకితభావం, సమష్టి కృషి, త్యాగం అలవర్చుకోవాలని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, విద్యా-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు మహానాడు వేడుకలు అట్టహాసంగా జరుగుతుంటే, మరోవైపు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఎన్టీఆర్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే, ఐటీ నిరుద్యోగులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అమీర్‌పేట్ మైత్రీవనం జంక్షన్ వద్ద దివంగత నేత ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు.
రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డును (యూనిఫైడ్ కార్డ్ ) రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ర్ణాటక రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ ఎంతగానో అభివృద్ధి చెందుతోంది.
ప్రపంచానికే తలమానికంగా నిలిచేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని మంత్రి పొంగులేటి తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.