ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డు : సీఎం రేవంత్

Publish Date:May 28, 2026

Advertisement

 

రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా ‘సమగ్ర సంక్షేమ కార్డును (యూనిఫైడ్ కార్డ్ ) రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా, ఏ పథకం కింద, ఎంత మేర లబ్ధి చేకూరుతోందో ఈ కార్డ్ ద్వారా స్పష్టంగా తెలిసేలా ఉండాలని సూచించారు. తక్షణమే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణారావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి.అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి తదితర ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం ఈ విషయాన్ని ప్రత్యేకంగా చర్చించారు. 

సమగ్ర సంక్షేమ కార్డ్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకేచోట అందుబాటులోకి వస్తుందని  ముఖ్యమంత్రి అన్నారు. ఈ డేటాను అన్ని కోణాల్లో  ఏఐ సహాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందన్నారు. నిజమైన అర్హులకు పథకాలు మరింత ఖచ్చితంగా చేరుతాయన్నారు. అదే సమయంలో అనర్హులను గుర్తించడం  సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి శాఖ వేర్వేరుగా కార్డులు ఇచ్చే పద్ధతికి బదులు, ఐటీ శాఖ ఆధ్వర్యంలో  సమగ్ర సంక్షేమ కార్డ్ ఉండాలని సీఎం సూచించారు. టెక్నాలజీపై పట్టున్న, చురుగ్గా పనిచేసే యువ ప్రభుత్వ అధికారులను ఈ ప్రక్రియకు వినియోగించాలని చెప్పారు.

ఈ కార్డ్‌లో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఫీజు రీయింబర్స్‌మెంట్, కార్మిక శాఖ, విద్యా శాఖ, ఇన్సూరెన్స్ పథకాలు, ప్రభుత్వం తీసుకువస్తున్న  బీమా పథకాల వివరాలు ఉండాలని చెప్పారు. అవసరమైతే ఆధార్ నంబర్‌ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్‌ ఇచ్చేలా ఆలోచించాలన్నారు. ఇటీవల ప్రభుత్వం  నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను కూడా ఈ కార్డ్‌కు అనుసంధానించాలన్నారు. 

లబ్ధిదారుల వివరాలతో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను సేకరించాలని ఐటీ శాఖను ఆదేశించారు. ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ ఉండాలని సీఎం సూచించారు ఎక్కడైనా మరణ ధృవీకరణ పత్రం జారీ అయితే, ఆ సమాచారం చేయూత పెన్షన్ డేటాబేస్‌కు చేరాలని, వెంటనే దాని ఆధారంగా చర్యలు మొదలయ్యేలా ఉండాలన్నారు. ప్రజల ఆరోగ్య ప్రొఫైల్‌ను కూడా సమగ్ర సంక్షేమ కార్డ్ తో  లింక్ చేయాలని చెప్పారు. 

కేరళ నుంచి  గల్ఫ్‌కు వలస వెళ్లే ఉద్యోగులకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలతో పాటు, పాస్‌పోర్ట్‌లు, వీసాల జారీకి సంబంధించిన సమాచారం ఒకేచోట అందుబాటులో ఉంచితే, అనధికార ఏజెంట్ల ప్రమేయం తగ్గుతుందని తెలిపారు. పేదలకు సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా చేరేలా, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రభావాన్ని అంచనా వేసేలా సమగ్ర సంక్షేమ కార్డ్ ఉండాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
 

By
en-us Political News

  
హైదరాబాద్ నగరంలో 14 సంవత్సరాలుగా పోలీసుల కన్నుగప్పి తిరుగుతున్న సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన
యువత అంకితభావం, సమష్టి కృషి, త్యాగం అలవర్చుకోవాలని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, విద్యా-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు మహానాడు వేడుకలు అట్టహాసంగా జరుగుతుంటే, మరోవైపు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఎన్టీఆర్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే, ఐటీ నిరుద్యోగులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అమీర్‌పేట్ మైత్రీవనం జంక్షన్ వద్ద దివంగత నేత ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు.
ర్ణాటక రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ ఎంతగానో అభివృద్ధి చెందుతోంది.
ప్రపంచానికే తలమానికంగా నిలిచేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని మంత్రి పొంగులేటి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పక్కన ఒక ట్రాన్స్‌జెండర్ కూర్చుని ముచ్చటిస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడమే కాదు.. పార్టీ క్యాడర్ నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురుస్తొంది.
తాజాగా ఈడీ పిలుపు మేరకు విజయసాయి గురువారం మరో సారి విచారణకు హాజరయ్యారు.
తన జట్టు ఓడిపోవడంతో స్టాండ్స్‌లో కూర్చున్న సన్‌రైజర్స్ కో-ఓనర్ కావ్య మారన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మైదానంలోనే ఆమె కన్నీటి పర్యంతమైన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యారు. అయితే ఆ తరువాత కావ్యామారన్ ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తికి క్రీడాభిమానులు ఫిదా అయ్యారు.
Police conduct scene reconstruction in lawyer murder case, Lawyers murder, Waqf Board, Advocate Moinuddin, CM Revanth reddy, Telangana goverment, DGP C.V. Anand, CP Sajjanar
కెన్యా దేశంలో గుండెల్ని పిండేసే అత్యంత విషాదకరమైన ఘోర ప్రమాదం ఒకటి చోటుచేసుకుంది.
ఇక 2014 నుంచి పవన్ తో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఎవ‌ర‌ని చేస్తే.. నాదెళ్లమనోహర్, లింగమనేని రమేష్, తాళ్లూరిరామ్.. వీరంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. చివరి ఇద్దరూ కూడా ప‌వ‌న్ కి, ఆయ‌న పార్టీ జ‌న‌సేన‌కు ఆర్థికంగా అండ‌గా నిల‌బ‌డిన వాళ్లే. పార్టీ ఆఫీస్ కూడా వీరిలో ఒక‌రిచ్చిన స్థలంలో కట్టిందే.
తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానం చేశారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.