ఇరాన్ కు రష్యా వెన్నుదన్ను!

Publish Date:Apr 1, 2026

Advertisement

అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తదాడులను ఇరాన్ దీటుగా ఎదుర్కొనడం వెనుక రష్యా వెన్నుదన్నులు ఉన్నాయన్న విషయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలో ఉంది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. రష్యా, ఇరాన్ సంబంధాలు, రష్యా ఇరాన్ కు అందిస్తున్న రక్షణ సహాయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  

యుద్ధ సమయంలో ఇరాన్‌కు రష్యా సహకారం ఏ మేరకు అన్న విషయంపై  ఆసక్తికర అంశాలు ఈ చర్చల ద్వారా వెలుగులోకి వస్తున్నాయి.  అమెరికా యుద్ధనౌకలు, ఫైటర్ జెట్ల కదలికలకు సంబంధించిన అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని మాస్కో ఇరాన్ కు చేరవేస్తున్నదన్న చర్చ జోరుగా సాగుతోంది. రష్యా నిఘా సహాయం కారణంగానే   ఇరాన్ అమెరికాను దీటుగా ఎదుర్కొనడమే కాకుండా, తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఎదురుదాడులకు పాల్పడగలుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

రష్యా   అత్యాధునిక 'లియానా' గూఢచారి ఉపగ్రహాల ద్వారా అమెరికా విమానవాహక నౌకలపై నిరంతరం నిఘా ఉంచుతూ, ఈ డేటాను ఇరాన్‌కు అందిస్తోందనీ, ఆ కారణంగానే..  పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం టెహ్రాన్‌కు తేలిక అవుతోందనీ చెబుతున్నారు. ముఖ్యంగా  ఖయ్యం వంటి శక్తివంతమైన శాటిలైట్ల రూపకల్పనలోనూ రష్యా సహకారం ఇరాన్‌కు కొండంత బలంగా మారిందంటున్నారు. ఖయ్యం  ఉపగ్రహం అందించే స్పష్టమైన చిత్రాల ఆధారంగా ఇరాన్ ప్రభావమంతంగా, శక్తిమంతంగా, సమర్ధవంతంగా అమెరికాపై క్షిపణిదాడులు నిర్వహించగలుగుతోందని చెబుతున్నారు.  

ఒక పోతే ఆయుధాల మార్పిడి విషయంలోనూ ఇరాన్, రష్యాల మధ్య ఉన్న బలమైన ఒప్పందం ఉందనీ,  ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ తన షాహిద్ డ్రోన్లను రష్యాకు భారీగా సరఫరా చేసిందనీ చెబుతున్నారు. కాగా యుద్ధ అనుభవాలతో  రష్యా షాహిద్ డ్రోన్లను మరింత ఆధునీకరించిందనీ, ఏఐ, యాంటీ జామింగ్ టెక్నాలజీతో వీటిని మరింత మెరుగుపరిచి వాటిని  తిరిగి ఇరాన్‌కు పంపిస్తోందనీ,  ఈ ఆధునిక సాంకేతికతతో  డ్రోన్లు శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థలను సులువుగా ఛేదిస్తున్నాయనీ, ఆ కారణంగానే అమెరికా అంచనాలు తప్పి ఇరాన్ గట్టిగా ప్రతిఘటించి అగ్రరాజ్యాన్ని ఉక్కిరిబిక్కరి చేయలగులుగుతోందంటున్నారు.   

By
en-us Political News

  
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల నవ్యాంధ్రకు రెండు పెద్ద దెబ్బలు తగిలాయని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
మండిపోతున్న ఎండలు, వడగాల్పులు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది.
హైదరాబాద్ నగరంలో 14 సంవత్సరాలుగా పోలీసుల కన్నుగప్పి తిరుగుతున్న సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన
యువత అంకితభావం, సమష్టి కృషి, త్యాగం అలవర్చుకోవాలని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, విద్యా-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు మహానాడు వేడుకలు అట్టహాసంగా జరుగుతుంటే, మరోవైపు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఎన్టీఆర్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే, ఐటీ నిరుద్యోగులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అమీర్‌పేట్ మైత్రీవనం జంక్షన్ వద్ద దివంగత నేత ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు.
రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డును (యూనిఫైడ్ కార్డ్ ) రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ర్ణాటక రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ ఎంతగానో అభివృద్ధి చెందుతోంది.
ప్రపంచానికే తలమానికంగా నిలిచేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని మంత్రి పొంగులేటి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పక్కన ఒక ట్రాన్స్‌జెండర్ కూర్చుని ముచ్చటిస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడమే కాదు.. పార్టీ క్యాడర్ నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురుస్తొంది.
తాజాగా ఈడీ పిలుపు మేరకు విజయసాయి గురువారం మరో సారి విచారణకు హాజరయ్యారు.
తన జట్టు ఓడిపోవడంతో స్టాండ్స్‌లో కూర్చున్న సన్‌రైజర్స్ కో-ఓనర్ కావ్య మారన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మైదానంలోనే ఆమె కన్నీటి పర్యంతమైన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యారు. అయితే ఆ తరువాత కావ్యామారన్ ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తికి క్రీడాభిమానులు ఫిదా అయ్యారు.
Police conduct scene reconstruction in lawyer murder case, Lawyers murder, Waqf Board, Advocate Moinuddin, CM Revanth reddy, Telangana goverment, DGP C.V. Anand, CP Sajjanar
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.