ప్రపంచానికే తలమానికంగా “ఫ్యూచర్ సిటీ” : మంత్రి పొంగులేటి

Publish Date:May 28, 2026

Advertisement

 

ప్రపంచానికే తలమానికంగా నిలిచేలా “ఫ్యూచర్ సిటీ” నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. గురువారం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కలిసి ప్రతిష్టాత్మక “ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయ భవనం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన “ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్టును ప్రపంచ స్థాయి గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా వేగంగా ముందుకు సాగుతోందన్నారు. FCDA కార్యాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన తేదీలపై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఫ్యూచర్ సిటీలో తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం వేస్తున్న పునాదులు రాబోయే తరాలకు ఆధునిక తెలంగాణ నిర్మాణానికి నాంది పలుకుతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే నగరంగా ఫ్యూచర్ సిటీ ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. ఇప్పటికే పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, గ్లోబల్ ప్రెజెన్స్ కలిగిన అనేక ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఇక్కడి నుంచే నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు.

యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించాలనే లక్ష్యంతో “యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ”ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎదురైన అనేక సవాళ్లను అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు.

ఫ్యూచర్ సిటీ తెలంగాణకే కాకుండా దేశానికే తలమానికంగా నిలిచే ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటోందని, ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ప్రపంచంలోని అనేక దేశాలు, రాష్ట్రాలు సైతం ఆలోచించని విధంగా తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.

ప్రస్తుతం తాత్కాలిక క్యాంపస్‌లో కొనసాగుతున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, పనుల పురోగతిని సమీక్షించి అవసరమైన నిర్ణయాలు తీసుకుని నిర్మాణాన్ని మరింత వేగవంతం చేస్తామని తెలిపారు.అనంతరం మంత్రులు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ కె. శశాంక, ఐఏఎస్, మహేశ్వరం డీసీపీ కె. నారాయణ రెడ్డి, ఐపీఎస్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు మహానాడు వేడుకలు అట్టహాసంగా జరుగుతుంటే, మరోవైపు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఎన్టీఆర్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే, ఐటీ నిరుద్యోగులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అమీర్‌పేట్ మైత్రీవనం జంక్షన్ వద్ద దివంగత నేత ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు.
రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డును (యూనిఫైడ్ కార్డ్ ) రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ర్ణాటక రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ ఎంతగానో అభివృద్ధి చెందుతోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పక్కన ఒక ట్రాన్స్‌జెండర్ కూర్చుని ముచ్చటిస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడమే కాదు.. పార్టీ క్యాడర్ నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురుస్తొంది.
తాజాగా ఈడీ పిలుపు మేరకు విజయసాయి గురువారం మరో సారి విచారణకు హాజరయ్యారు.
తన జట్టు ఓడిపోవడంతో స్టాండ్స్‌లో కూర్చున్న సన్‌రైజర్స్ కో-ఓనర్ కావ్య మారన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మైదానంలోనే ఆమె కన్నీటి పర్యంతమైన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యారు. అయితే ఆ తరువాత కావ్యామారన్ ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తికి క్రీడాభిమానులు ఫిదా అయ్యారు.
Police conduct scene reconstruction in lawyer murder case, Lawyers murder, Waqf Board, Advocate Moinuddin, CM Revanth reddy, Telangana goverment, DGP C.V. Anand, CP Sajjanar
కెన్యా దేశంలో గుండెల్ని పిండేసే అత్యంత విషాదకరమైన ఘోర ప్రమాదం ఒకటి చోటుచేసుకుంది.
ఇక 2014 నుంచి పవన్ తో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఎవ‌ర‌ని చేస్తే.. నాదెళ్లమనోహర్, లింగమనేని రమేష్, తాళ్లూరిరామ్.. వీరంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. చివరి ఇద్దరూ కూడా ప‌వ‌న్ కి, ఆయ‌న పార్టీ జ‌న‌సేన‌కు ఆర్థికంగా అండ‌గా నిల‌బ‌డిన వాళ్లే. పార్టీ ఆఫీస్ కూడా వీరిలో ఒక‌రిచ్చిన స్థలంలో కట్టిందే.
తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానం చేశారు
రూఫ్ టాప్ సోలార్ ప్లాంటును ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా వివిధ బ్యాంకులు వినియోగదారులకు లోన్ మంజూరు చేస్తున్నాయి. అంతేకాకుండా సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండడంతో వినియోగదారులపై భారం గణనీయంగా తగ్గుతోంది. గృహంపై 2 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు రూ. 1.5 లక్షలు వ్యయం అవుతుండగా, అందులో రూ. 60,000లను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ
భువనేశ్వర్‌లో విమానం ల్యాండింగ్ కు వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్ ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. అనంతరం అక్కడ కొంతసేపు నిలిపిన విమానాన్ని అర్ధరాత్రి తిరిగి శంషాబాద్‌కు తీసుకువ చ్చినట్లు సమాచారం. ఈ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర అయోమయానికి గురయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.