అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మార్గదర్శి ఉషా చిలుకూరి వాన్స్!

Publish Date:May 13, 2026

Advertisement

చిలుకూరి ఉషా వాన్స్.. అమెరికా రాజకీయ యవనికపై ఇప్పుడీ పేరు మార్మోగిపోతున్నది. ఉషా చిలుకూరి అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి. .  సాధారణ తెలుగు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి..  ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంలో సెకండ్ లేడీ హోదా చేరుకోవడం వెనుక   కృషి, పట్టుదల, మేధస్సు  ఉన్నాయి. ఆమె ప్రయాణం..   ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు..   భారతీయులకు, మరీ ముఖ్యంగా తెలుగు వారికి ఇదొక గర్వకారణమైన విషయం.

ఉష చిలుకూరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన వడ్లూరు గ్రామం. ఆమె తల్లిదండ్రులు ఉన్నత విద్యావంతులు కావడంతో, చిన్నతనం నుంచే ఆమెకు చదువుపై మక్కువ పెరిగింది. అమెరికాలోనే పుట్టి పెరిగినప్పటికీ, ఉషా చిలుకూరి భారత సంస్కృతిని, విలువలను   ఎప్పుడూ మర్చిపోలేదు. యేల్ యూనివర్సిటీలో లా చదువుతున్న సమయంలోనే ఆమెకు జేడీ వాన్స్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా, ఆపై ప్రేమగా చిగురించి వారి వివాహానికి దారి తీసింది. . సపోజ్ ఉపను వివాహం చేసుకోలేకపోయి ఉంటే.. తాను ఆజన్మాంతం బ్రహ్మచారిగానే మిగిలిపోయి ఉండేవాడినని  వాన్స్ అన్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు.. వాన్స్ ఎదుగుదలలో ఉషా చిలుకూరి వాన్స్ పాత్ర ఎంత ఉందన్నది. . జేడీ వాన్స్ రాసిన సుప్రసిద్ధ పుస్తకం హిల్‌బిల్లీ ఎలిజీ లో తన జీవితంలో ఉష పాత్ర ఎంత కీలకమో కళ్లకు కట్టినట్లు వివరించారు వాన్స్.   తన జీవితంలోని కష్టకాలంలో ఉష తనకు ఎలా అండగా నిలిచింది, తన ఆలోచనా దృక్పథాన్ని  ఎలా మార్చింది ఆయన ఆ పుస్తకంలో   వివరించారు.

జేడీ వాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎదిగే క్రమంలో ఉష చిలుకూరి  వెనుక ఉండి నడిపించే ఒక శక్తి.  ఉష కేవలం అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ భార్య మాత్రమే కాదు.. ఆయన మార్గదర్శి కూడా. అంతే కాదు, ఆమెకు తనదంటూ ప్రత్యేక గుర్తింపు కూడా సాధించారు.  యేల్ లా స్కూల్‌లో ఎంతో ప్రతిభ కనబరిచిన ఉష, సుప్రీం కోర్టు క్లర్క్‌గా కూడా పనిచేశారు. ఆమె విద్యా నేపథ్యం, వృత్తిపరమైన విజయాలు అమెరికాలోని భారతీయ సంతతికి స్ఫూర్తిగా నిలుస్తాయి. 

తెలుగు మూలాలు కలిగిన మహిళగా, అమెరికా వంటి అగ్రరాజ్యంలో అత్యున్నత పదవులకు చేరువ కావడం గొప్ప విషయం. ఆమె భర్త జేడీ వాన్స్ విజయాల్లో ఆమె వెన్నంటి ఉండి ప్రోత్సహించారు. వారి అనుబంధం, పరస్పర అవగాహనా వారిని ఐడియల్ కపుల్ గా నిలబెట్టాయనడంలో సందేహం లేదు. జేడీ వాన్స్ స్వయంగా ఉషను తన ఆధ్యాత్మిక మార్గదర్శిగా అభివర్ణిస్తారు.   సంప్రదాయాలను గౌరవిస్తూనే, ఆధునిక రంగాల్లో రాణించడం ఎలా అంటే ఎవరైనా సరే ఉషా చిలుకూరి వాన్స్ ను చూపిస్తారు.  

By
en-us Political News

  
పటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులు నాటౌట్ గా నిలిచి గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బెంగళూరు గుజరాత్ పై ఆర్సీబీ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో కదం తొక్కారు.
తెలంగాణలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
వైజాగ్ బీచ్‌లో అరుదైన వింత.. సముద్రాన్ని ముద్దాడిన ఆకాశం
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూసిన వేతన సవరణ ఉత్తర్వులు చివరకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
కడప రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది.
బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
నేటి ఆధునిక కాలంలో పెళ్లి అనేది నూరేళ్ల పంట అనుకుంటారు.
తనకు భద్రత కల్పించాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రొఫెసర్ నాగేశ్వర్‌ కలిశారు.
హైదరాబాద్ మహానగరంలో మంగళవారం మధ్యాహ్నం ఒక ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.