తెలంగాణలో పాతిక వేల మంది బోగస్ ఉద్యోగులు.. రేవంత్
Publish Date:Mar 4, 2026
Advertisement
తెలంగాణలో దాదాపు పాతిక వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా కనీసం ఆధార్ కార్డు కూడా లేకుండా ఏళ్ల తరబడి జీతాలు తీసుకుంటున్నారు. ఈ సంచలన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం (మార్చి 3) నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న 1.70 లక్షల మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల్లో నకిలీ ఉద్యోగులను గుర్తించినట్లు చెప్పిన రేవంత్ రెడ్డి ఇలాంటి బోగస్ ఉద్యోగులను సృష్టించి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలపై సమగ్ర ఆడిట్ చేయించి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
http://www.teluguone.com/news/content/25-thousand-bogus-employees-in-telangana-36-214975.html





