కిరణ్ కు పదవీ గండం తప్పదా?

Publish Date:Jun 15, 2012

Advertisement

ఉపఎన్నికల ఫలితాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి షాక్ ఇచ్చాయి. ఈ ఎన్నికల్లో కనీసం ఐదారు స్థానాల్లోనైనా గెలుస్తామనే ధీమాతో కిరణ్ తో పాటు కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. అయితే వారి అంచనాలకు భిన్నంగా ఫలితాలు రావడమే కాకుండా కొన్ని చోట్ల పార్టీ అభ్యర్థులు మూడో స్థానంలో నిలబడడం, డిపాజిట్లు కోల్పోవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ తన సర్వశక్తులను వినియోగించింది. మెరుగైన ఫలితాల కోసం వాయలార్ రవి, గులాంనబీ ఆజాద్ వంటి అతిరథ మహారథులు ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రులందరూ ఎన్నికల బాధ్యతను మోశారు. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. జగన్ ను రాజకీయంగా పాతర వేయడమనే ఏకైక ఎజెండాతో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పోరాడింది. కిరణ్ కుమారైతే గొంతుచించుకుని మరీ జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ కు ఓటు వేస్తే అవినీతికి ఓటు వేసినట్లేనని ఊరూరా ప్రచారం చేశారు. కొన్ని చోట్ల జగన్ అభ్యర్థులను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ తన చిరకాల ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపిందన్న విమర్శలు కూడా వచ్చాయి. ఎలాగోలా కనీసం ఐదారు స్థానాలు కైవసం చేసుకోవాలన్న కిరణ్ కుమార్ ఎత్తుగడలు విఫలమయ్యాయి. రాజీవ్ యువకిరణాలు, మహిళలకు రుణాలు వంటి సంక్షేమ పథకాలను ఎన్నికల సభల్లో చెప్పినప్పటికీ ఓటర్లు ఆలకించలేదు. దీంతో జగన్ అవినీతిపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఈ వ్యూహం కూడా బెడిసికొట్టి ఓటమి పాలవడంతో కిరణ్ అధిష్టానం దృష్టిలో చులకనైపోయారు. జగన్ పార్టీ విఅజయంతో కాంగ్రెస్ లో కుమ్ములాటలు మరింత ముదురుతాయనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ లో కొనసాగితే తమకు ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదనే అనుమానంతో చాలామంది శాసన సభ్యులు, కొందరు మంత్రులు కూడా ఉన్నారు. వీరిని కంట్రోల్ చేయలేకపోతే కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి పదవి ఊడుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులు జగన్ పంచన చేరితే కిరణ్ సర్కార్ పతనమైపోతుంది. ఎలా చూసినా మరో కొద్ది నెలల్లో కిరణ్ కుమార్ రెడ్డికి పదవీగండం ఖాయంగా కనిపిస్తోంది.

By
en-us Political News

  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
women cricketer Nandini suicide,BCCI Under 19 cricket, Vikarabad crickete, rFemale cricketer suicide
బీసీ రాజ్యాధికార పాదయాత్రలో తన వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అక్రమ రవాణా ముఠాలకు సింహస్వప్నం.. వేలాది మంది బాధితులకు విముక్తి.. 2 వేల మందికి పైగా సివిల్ సర్వెంట్లకు మార్గదర్శకత్వం.
రాష్ట్రంలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే అంశాలపై ప్రముఖులు స్పందిస్తుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇటీవలి కాలంలో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్వహించిన దాండియా వేడుకలో దురదృష్టవశాత్తు ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అలాగే ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా సినిమా ప్రమోషన్ ఈవెంట్  నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.  
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి 10వ తరగతి విద్యార్థి హత్య.!
అత్యవసర అవసరాల నిమిత్తం శ్రీను ఒక మొబైల్ లోన్ అప్లికేషన్ ద్వారా  40 వేల రూపాయలు రుణం తీసుకున్నాడు. అయితే అనుకోని ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల నుంచి శ్రీనుకు   వేధింపులు ప్రారంభమయ్యాయి.
275 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు...మంత్రి శ్రీధర్ బాబు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.