ఆ గణపతికి తొండం వుండదు! ఎందుకో తెలుసా?

Publish Date:Sep 9, 2016

Advertisement

వినాయక నవరాత్రులు దేశమంతటా మహా వైభవంగా సాగుతున్నాయి. అయితే, ఏ దేవుడ్ని పూజించినా తొలి పూజ తాను అందుకుని మనకు అనుజ్ఞ ఇచ్చే విఘ్నేశ్వరుడు ఈ నవరాత్రి ఉత్సవాల వేళ మరింత ముఖ్యమైపోతాడు! అంతే కాదు, గణపతి మిగతా అందరు దేవుళ్లకంటే చాలా చాలా పాప్యులర్ కూడా! చిన్న పిల్లలు మొదలు వృద్ధుల దాకా అందరికీ ఆయన ఫేవరెటే! సామాన్యంగా దేవుడి జోలికి పెద్దగా వెళ్లని యూత్ ని కూడా సినిమాలు, ప్రేమ, దోమా లాంటి అన్ని వ్యాపకాల నుంచి పదకొండు రోజులు దూరం చేసి మండపాల్లో బుద్దిగా కూర్చోబెడతాడు గణఫయ్య! అయితే, లంబోదరుడికి ఊరూరా , వీధి వీధినా పూజలందుకునే ప్రత్యేకతే కాదు ఇంకా బోలెడు విశేషాలున్నాయి. ఆయన్ని భక్తులు ఎవరికి తోచిన రూపంలో వారు పూజిస్తారు. ఒకరు మట్టితో చేస్తే మరోకరు సీసంతో, ఇంకొకరు గరికతో, మరొకరు ఆకుకూరలతో , పళ్లతో ఇలా ఇప్పటి వరకూ గణపతి రకరకాలుగా తయారు చేసుకున్న వారు బోలెడుమంది!

మట్టితో మొదలు రాతితో వరకూ... ఏ పదార్థంతో చేసినా వినాయకుడి తల ఎలా వుంటుంది? ఏనుగు ముఖంతో వుంటుంది. అందుకే, ఆయనని గజాననుడని, ఏక దంతుడని, గజవక్త్రృడని రకరకాలుగా కీర్తిస్తుంటాం. దీనికి కారణం కూడా మనకు తెలిసిందే. పార్వతీ దేవీ నలుగు పిండితో బాలుడిని చేసి ద్వారం వద్ద వుంచితే శివుడొచ్చి ఆ బాలుడి తల నరికేస్తాడు. ఆ పసివాడు పరమేశ్వరుడ్ని అడ్డగించడమే కారణం. తరువాత గణపతికి ఏనుగు తల పెట్టి తిరగి బతికిస్తాడు శంకరుడు! ఇక అప్పట్నుంచీ గజ ముఖంతోనే అందరికీ దర్శనమిస్తుంటాడు లంబోదరుడు. 

పార్వతీ దేవీ చక్కనైన బాలుడిగా ప్రాణం పోసిన ఆది గణపతికి మనందరి లాగే నర ముఖం వుండేది. మరి ఆ ముఖంతో ఇప్పుడు మనం గజాననుని చూడలేమా? మామూలుగా అయితే చూడలేమనేదే సమాధానం. కాని, తమిళనాడులోని ఆ ఒక్క ఆలయానికి వెళితే మాత్రం నర ముఖంతో వున్న గజ ముఖుని చూడొచ్చు!  తమిళనాడులోని తిరువరూర్ జిల్లాలో కూతనూర్ వద్ద పూన్ తొట్టమ్ కి దగ్గర్లో వుంటుంది తిలతర్పణపురం. పేరు వినగానే అర్థమైపోతోంది కదా దీని విశేషం ఏంటో? తిలలతో తర్పణాలు ఇవ్వటం ఇక్కడ మహా ప్రశస్తం. కాశీ, రామేశ్వరాల్లో ఎలాగైతే పితృ దేవతలకు తిల తర్పణాలు ఇస్తారో ఇక్కడ కూడా అలాగే సమర్పిస్తుంటారు. దీని వల్ల పితృ దోషం పోతుందని విశ్వాసం. 

తిలతర్పణపురం అధిష్టాన దైవం ముక్తేశ్వర స్వామి. ఈ శివుడి అర్థాంగి అయిన అమ్మవారి పేరు సువర్ణవళ్లి. సువర్ణవళ్లి, ముక్తేశ్వరుల దర్శనానికి వెళ్లిన భక్తులకు మొదట్లోనే కనిపిస్తాడు నర ముఖ గణపతి. శివాలయానికి ముందు భాగంలో ఈ ఆదిగణపతి ఆలయం వుంటుంది. మిగతా అందరు హిందూ దేవుళ్ల మాదిరిగా ఇక్కడ గజాననుడు మనిషి ముఖంతో భక్తుల్ని తరింపజేస్తుంటాడు. పార్వతీ దేవీ ప్రాణం పోసిన ఆదిమ సమయంలోని నర ముఖంతో వుంటాడు కాబట్టి ఇక్కడ ఈ వినాయకుడ్ని ఆది గణపతి అంటారు! తిలతర్పణ పుర ఆది గణపతి కేవలం రూపంలో మాత్రమే విభిన్నంగా వుండడు. ఆయన్ని పూజిస్తే కలిగే ఫలితాలు కూడా విభిన్నమే. ఆయన్ని స్వయంగా ఆగస్త్య మహర్షి సేవించాడంటారు! అంతే కాదు, ఈయన్ని మనం పూజిస్తే ఇంట్లో వారి మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంటుందట! విద్యార్థులు, పిల్లలు ఈ ఆది దంపతుల తనయుడైన ఆది గణపతిని పూజిస్తే తిరుగులేని జ్ఞాపకశక్తి, తెలివితేటలు ప్రసాదిస్తాడని కూడా చెబుతారు!

పెద్ద తొండం, పెద్ద పెద్ద చెవులు, ఏక దంతం... వీటితో దర్శనమిచ్చే మనకు తెలిసిన అపురూప గణపతి కొత్త రూపంలో కావాలంటే తిలతర్పణ పురం తప్పక వెళ్లండి! ఆదిశంకరుడు, అమ్మవారి కృపతో పాటూ ఆది గణపతి అనుగ్రహం కూడా పొందండి!    
 

By
en-us Political News

  
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.