జాగ్రత్త.. బెర్రీలు తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకూడదు..!




బెర్రీలు చాలా మంది ఇష్టంగా తినే పండ్లు. వీటిలో బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెర్రీ.. ఇట్లా చాలా రకాలు ఉంటాయి.  తియ్యగా, పుల్లగా ఉంటూ ప్రత్యేకమైన సువాసన కలిగి ఉండే బెర్రీలు అంటే అందరికీ ఇష్టమే..  వీటిని ఉపయోగించి చేసే జ్యూస్ లు, స్మూతీలు, ఐస్ క్రీమ్ లకు చాలా ఆదరణ ఉంది.  వీటి ప్లేవర్ అంత బాగుంటుంది మరి. అయితే బెర్రీలు తినగానే కొన్ని రకాల ఆహారాలు, ద్రవ పదార్థాలు అస్సలు తీసుకోకూడదు అంట.  అలా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడి ఫుడ్ పాయిజన్ జరిగే ప్రమాదం ఉంటుందట. ఇంతకీ బెర్రీలు తిన్న తరువాత తీసుకోకూడని పదార్థాలు ఏంటో తెలుసుకుంటే..

పాలు..

బెర్రీలు తిన్న తర్వాత పాలు తీసుకోవడం కానీ, లేక  పాలు కలిపి బెర్రీలను తినడం కానీ ఆరోగ్యానికి మంచిది కాదట.  ఇది జీర్ణక్రియకు ప్రమాదకరం. రెండూ కలిసి యాసిడ్-బేస్ రియాక్షన్‌కు కారణమవుతాయి. దీని వలన గ్యాస్, కడుపు నొప్పి,  అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.

దోసకాయ..

దోసకాయ,  బెర్రీలు  రెండూ శరీరాన్ని చల్లబరిచే  ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల శరీరంలో  అవసరానికి మించి చల్లదనం పెరుగుతుంది.  ఇది జలుబు,  అజీర్ణానికి కారణమవుతుంది.

నీరు..

బెర్రీలు  తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది. దీనివల్ల కడుపులో గ్యాస్, తిమ్మిర్లు,  కొన్నిసార్లు వాంతులు కూడా వస్తాయి. బెర్రీలు తిన్న తర్వాత  కనీసం 30 నిమిషాల తర్వాత నీరు త్రాగాలి.

ఊరగాయలు..

 బెర్రీలు,  ఊరగాయలు రెండూ పుల్లగా,  ఆమ్లంగా ఉంటాయి. వీటిని కలిపి తినడం వల్ల ఆమ్లత్వం, గుండెల్లో మంట,  కడుపు నొప్పి వచ్చే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతాయి. అందుకే బెర్రీలు తిన్న తర్వాత ఊరగాయల జోలికి పోకూడదు.

సిట్రస్ పండ్లు..

నారింజ, నిమ్మ వంటి పండ్లను సిట్రస్ పండ్లు అంటారు.  బెర్రీలను   తిన్న వెంటనే సిట్రస్ పండ్లను  తినకూడదు. ఎందుకంటే ఈ రెండూ పుల్లని పండ్లు. దీనివల్ల విరేచనాలు,  కడుపు నొప్పి వస్తుంది.

కూల్ డ్రింక్స్..

బెర్రీలు తిన్న తర్వాత చల్లని పానీయాలు తాగకూడదు. దీని వల్ల శరీరంలో రసాయన ప్రతిచర్య ఏర్పడుతుంది. ఇందులో ఉండే చక్కెర,  కార్బన్ డయాక్సైడ్ బెర్రీలలో ఉండే  సహజ ఆమ్లంతో కలిసిపోయి గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తాయి.


                                    *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..

Related Segment News