ఇంటర్నెట్ అడిక్షన్ డిజార్ఢర్ గురించి తెలుసా?

నేటి ఇంటర్నెట్ యుగంలో పిల్లల నుండి పెద్ద వారి వరకు ఫోన్ లేకపోయినా, నెట్ కనెక్షన్ లేకపోయినా ఒక్క నిముషం కూడా ఉండలేని స్థితికి దిగజారిపోయారు. ఫోన్ లేకపోతే పిల్లలు అన్నం తినరు, హోం వర్క్ చెయ్యరు,  చివరకు అల్లరి చేయకుండా నిద్రపోవడానికి సిద్దం కారు.   ఇక పెద్దలు అయితే సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యి ఫేస్ బుక్, యూట్యూబ్ లో గంటలు గంటలు కాలక్షేపం చేస్తుంటారు. ఇది చాలామందిల వ్యసనంగా మారుతోంది.  ఎప్పుడూ పోన్ కు, ఇంటర్నెట్ కు అతుక్కుని ఉండేవారికి ఇంటర్నెట్ అడిక్షన్ డిజార్డర్ సమస్య ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడపడం, బాధ్యతలను విస్మరించడం, జీవితం మీద సీరియస్ నెస్ లేకపోవడం,  జీవితంలో సమస్యలను ఎదుర్కోవడానికి బదులు వాటి నుండి తప్పించుకోవడం వంటివి చేస్తున్నారు.  ఈ సమస్య నుండి బయట పడటానికి ఏం చేయాలో వైద్యులు ఏం చెప్పారో తెలుసుకుంటే..


సమస్యను గుర్తించాలి. ఇంటర్నెట్ అడిక్షన్ డిజార్ఢర్ ని అధిగమించడంలో మొదటి దశ సమస్య ఉందని అర్థం చేసుకోవడం. మీ ఇంటర్నెట్ వినియోగ విధానాలను గమనించుకోవాలి.   ఇది  దైనందిన జీవితాన్ని, సంబంధాలను, పనితీరును  ప్రతికూలంగా  ఎలా ప్రభావితం చేస్తుందో లేదో అంచనా వేయండి.


ఇంటర్నెట్ వినియోగం కోసం కొన్ని రూల్స్ ఏర్పాటుచేసుకోవాలి. ఇంటర్నెట్‌ని ఉపయోగించడం కోసం రోజులో నిర్దిష్ట సమయాలను కేటాయించుకోవాలి.  ఈ పరిమితులకు కట్టుబడి ఉండాలి. ఆన్‌లైన్‌లో  గడిపే  సమయాన్ని ట్రాక్ చేయాలి. దాన్ని నియంత్రించడంలో  సహాయపడే స్మార్ట్‌ఫోన్ యాప్‌లు లేదా బ్రౌజర్ లను ఉపయోగించాలి.


ఇంటర్నెట్‌తో సంబంధం లేని హాబీలు,  కార్యకలాపాలను ఎంచుకోవాలి. పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయడం, తోటపని చేయడం లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులను  కలుసుకోవడం, వారితో మాట్లాడటం వంటివి చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఇవి ఆలోమేటిక్ గా  ఆన్‌లైన్‌లో ఉండాలనే ప్రలోభాన్ని తగ్గేలా చేస్తాయి.

ఆన్లైన్ వ్యసనాన్ని తగ్గించుకోవడానికి  స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా థెరపిస్ట్‌ను సంప్రదించండి. వారి సపోర్ట్ తీసుకోవాలి.  ఇంటర్నెట్ వినియోగం గురించి  ఆందోళనలను,  అది  జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చర్చించాలి. కొన్నిసార్లు, ఎవరితోనైనా మాట్లాడటం వలన  సమయాన్ని ఆన్‌లైన్‌లో సమయాన్ని  సమర్థవంతంగా నిర్వహించడానికి,  కొత్త దృక్కోణాలు,  వ్యూహాలను అమలుచేయడానికి మార్గాలు దొరికే అవకాశం ఉంటుంది.


పని లేదా ఏదైనా పరిశోదించడం, విశ్రాంతి, వ్యాయామం, కొత్త విషయాలు తెలుసుకోవడం వంటి వాటిపై దృష్టి పెట్టాలి. టీవి, ఫోన్, సిస్టమ్ మొదలైనవాటి  నుండి రెగ్యులర్ బ్రేక్‌ తీసుకోవాలి.   ధ్యానం లేదా మైండ్‌ఫుల్‌నెస్ వ్యాయామాలు వంటి స్వీయ-సంరక్షణ కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వండి.


                                                      *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu