కవితక్క కర్మ సిద్ధాంతం మతలబిదేనా?
posted on Nov 15, 2025 9:05AM
.webp)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై తెలంగాణ జాగృతి కవిత సింపుల్ గా కర్మ హిట్స్ బ్యాక్ అని చేసిన వ్యాఖ్య ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ వ్యాఖ్యల అర్ధం ఏమిటి? అని అంతా తలలుబాదుకుంటున్నారు. ఇక జూబ్లీ ఉప ఎన్నికలో ఓటమిని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా ఏమంత సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. మాగంటి సునీత ఆమె నైతిక విజయం నాదే అంటూ ముక్తాయించేశారు. వాళ్లు రిగ్గింగ్ చేసి గెలిచారని నవ్వుతూ చెప్పేసి వెళ్లిపోయారు. ఇక కేటీఆర్ అయితే ఈ ఫలితంపై ఎటువంటి సంచలన కామెంట్లూ చేయలేదు. అదేమంటే అధికార పార్టీ అన్నాక, ఉప ఎన్నికలన్నాక గెలవడం ఖాయమన్న పర్మినెంట్ స్టేట్మెంట్ ఒకటి పడేశారు. మరి తమ జమానాలో దుబ్బాక, హుజూరాబాద్ వంటి ఉప ఎన్నికల్ని ఎందుకు ఓడారో ఆయన చెప్పాల్సి ఉంది.
ఇక కర్మ విషయానికి వస్తే.. ఇప్పటికే గోపీనాథ్ మృతి పట్ల ఆయన తల్లి అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయంపై బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం తీవ్ర ఆరోపణలు చేశారు. గోపీనాథ్ కేటీఆర్ కి బినామీ అనీ.. అంటారు. ఈ ఆస్తుల పంపకాల్లో తేడాల కారణంగా కేటీఆర్ తో కలసి తన వాటా కోసం సునీత కూడా కుట్ర చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. అసలీ టికెట్ ఇచ్చిందే ఆ లావాదేవీల్లో భాగం అంటున్నారు కొందరు.
ఓవరాల్ గా మాగంటి డెత్ మిస్టరీ అయితే ఇప్పట్లో వీడేలా లేదు. ప్రత్యేకించి మాగంటి తల్లి మహానందినీ దేవి పట్టుబట్టి మరీ పోలీసులను ఇందులో విచారణ చేయమని బలవంత పెడితే తప్ప. ఇది వరకే ఈ విషయంలో సీఎం రేవంత్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన బండి సంజయ్ మాగంటి మృతి విషయంలో ఫిర్యాదు చేస్తే విచారణ జరిపిస్తామని చెప్పేశారు కూడా. మరి వీటి పర్యావసానాలేంటి? ఇదంతా ఎన్నికల ముందు వరకేనా? తర్వాత ఎవరికి వారు ప్యాక్ అప్ చెప్పి సైడ్ అవుతారా తేలాల్సి ఉంది.
అయితే ఇందులోని అసలు నిజం ఎప్పుడు బయట పడే అవకాశముందంటే, ఇప్పట్లో ఇదంతా తేలకుంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ల పందేరం దగ్గర మాత్రం ఇదొక సంచలనంగా మారే అవకాశం లేక పోలేదు. ఎందుకంటే ఈ టికెట్ ని తిరిగి సునీతకు ఇవ్వకుంటే.. ఆమె దీనిపై ఏదైనా ఓపెన్ గా కేటిఆర్ సెంట్రిక్ గా సంచలన వ్యాఖ్యలు చేసే ఛాన్సయితే లేక పోలేదు. మరి అప్పటి వరకూ ఈ కర్మ ఆగుతుందా? లేక మధ్యలోనే బ్లాస్ట్ అవుతుందా? తేలాల్సి ఉంది.