అమెరికా సుంకాల యుద్ధం వెనుక అసలు కథ ఇదేనా?

భారత్, అమెరికాల మధ్య సంబంధాలు చెడటానికి అసలు కారణం.. అగ్రరాజ్య అధినేత టారిఫ్ వార్ ఒక్కటే కాదని పరిశీలకులు అంటున్నారు.  అసలు కథ  వేరే ఉందంటున్నారు. ట్రంప్ కోరినట్లుగా  జన్యుపర విత్తనాల (Genetic seeds) ఒప్పందానికి  భారత్ అంగీకరించకపోవడమే అసలు కారణంగా చెబుతున్నారు. ఒక వేళ భారత్ జెనిటిక్ సీడ్స్ ఒప్పందానికి అంగీకరించి ఉంటే..   అమెరికా విత్తనసంస్థ మాన్ శాంటో ఏజెంట్ బేయర్  పెత్తనం చెలాయిస్తారు. జెనిటిక్ సీడ్స్ పేటెంట్ పొందిన సంస్థ కసారి   దేశంలోకి అనుమతిస్తే.. ఇక అంతే సంగతులు.  ఆ విత్తనం విత్తితే తరతరాలు ఆ సంస్థకు సొమ్ములు చెల్లిస్తూ ఉండాల్సిందే.

అంతే కాదు దేశీయ విత్తన సంస్థలు మూడపడాల్సింది. అలాగే రైతువారీ విత్తన సేకరణకు ఫుల్ స్టాప్ పడాల్సిందే.  స్వదేశీ వ్యవసాయ పరిశోధనలు ఇక  గతించిన చరిత్రగా మారిపోతాయి. . 1950, 1960లలో అంటే ఇండియాలో ఇంకా హరిత విప్లవం మొదలు కాని రోజులలో  అమెరికా పీఎల్ 480 పేరుతో గోధుమలను సరఫరాచేసేది. అయితే ఆ సరఫరాకు అమెరికా విధించిన షరతులు దేశానికి ఆమోదయోగ్యం కాకపోవడం వల్లనే దేశంలో హరిత విప్లవానికి నాంది పలికింది. 

ఇప్పుడు అమెరికాలో తయారవుతున్న జెనిటిక్ క్రాప్స్  మొక్కజోన్న,సోయా తదితరాలు  మనిషిని చంపవు కానీ శరీరాన్ని గుల్లు చేసే రసాయినాలు కలిగి ఉంటాయి. ఆ కారణంగా అమెరికా జెనిటిక్ క్రాప్స్ ను ఇక్కడ దేశీయంగా వినియోగిస్తే..  మందుల వినియోగాన్ని విపరీతంగా పెరిగిపోతుంది. ఒళ్లు, జేబూ కూడా గుల్ల అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. ఇంకా స్పష్టంగా ఉదాహరణ ఇవ్వాలంటే.. అమెరికాలో 1990 తరువాత ఊబకాయుల సంఖ్య పెరిగిపోవడానికి ఈ జెనిటిక్ క్రాప్సే కారణం. చిన్న తనంలోనూ డయాబెటిక్ వంటి వ్యాధుల సంక్రమణకూ ఇవే కారణమని వైద్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే  సంతానలేమి, ,కాన్సర్,కాలేయవ్యాధులు, గుండెజబ్బులు విపరీతంగా పెరగడానికీ ఇవే కారణం.దీనివల్ల మందుల వినియోగం పెరిగిపోవడం సహజం. ఈ సకల దుష్ఫరిణామాలకూ  జన్యూపరమైన పంటలు, వాటితో తయారైన ఆహారం పదార్ధాలు కారణమని నిపుణులు చెబుతున్నారు.  అందుకే ఇండి యా జెని టిక్స్ సీడ్స్ ఒప్పందానికి నిర్ద్వంద్వంగా నో చెప్పింది.  జబ్బులు, రుగ్మతలతో పాటు ఈ ఒప్పం దానికి ఔదాల్చితే  దేశీయ విత్తనాలు,  పంటలు,  ఆత్మగౌరవం,  భవిష్యత్తు ఇవేమీ ఉండవు. ఈస్టిండియా కంపె నీ వాణిజ్యం పేరుతో ఇండియాను ఆక్రమించిన వలసకాలంనాటి పరిస్థితులు మళ్లీ ఇప్పుడు పునరావృతమౌతాయంటున్నారు పరిశీలకులు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu