మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

 

మంత్రి కొండా సురేఖపై నాంపల్లి స్పెషల్ కోర్టు షాక్ ఇచ్చింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మంత్రిపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. ఈ పిటిషన్ విచారిస్తూ, కొండా సురేఖ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

ఈ నేపధ్యంలో ఫిబ్రవరి 5వ తేదీ, 2026 సంవత్సరం లోపు కొండా సురేఖ నేరుగా కోర్టులో హాజరు అవ్వాలని కోర్టు పేర్కొన్నాది. గతంలో  అక్కినేని  నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా   తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేటీఆర్ డ్రగ్స్ వాడతారని  అని, రేవ్ పార్టీలు నడుపారని విమర్శించారు.  టాలీవుడ్ నటులు నాగ చైతన్య-సమంతా రూత్ ప్రభు విడాకులకు కేటీఆర్ కారణమని ఆరోపించారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu