జీవితంలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయను : జగ్గారెడ్డి

 

కాంగ్రెస్ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో అసెంబ్లీ ఎన్నికల్లో మర్చిపోలేనిదని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ఇళ్ళ స్థలం లేని పేదలతో సంగారెడ్డిలోని గంజి మైదానంలో టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ వచ్చి నన్ను గెలిపించాలని ప్రచారం చేస్తే, నన్ను  ఇక్కడ ఓడించారు. జగ్గారెడ్డిని గెలిపించాలని రాహుల్‌ గాంధీ అడిగితే.. నన్ను ఓడించారు. నా జీవితంలో ఇది మరిచిపోలేనిది. 

అందుకే సంగారెడ్డిలో జీవితంలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాని  హాట్‌ కామెంట్స్‌ చేశారు. నా ఓటమికి కారణం పేద ప్రజలు కాదు..ఇక్కడి మేధావులు.. పెద్దలది. రేపు సంగారెడ్డిలో నా సతీమణి నిర్మలా పోటీ చేసిన కూడా నేను ప్రచారం చేయను. రాష్ట్రంలో నేను ఎక్కడికైన వెళ్ళి ప్రచారం చేస్తా కానీ.. సంగారెడ్డిలో ప్రచారం చేయను’ అని జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu