తిరుమలలో భక్తుల రద్దీ
posted on Sep 21, 2025 10:38AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 82,042 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,393 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి ఆదాయం రూ. 4.59 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ ఉదయం శ్రీవారిని ఏపీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. తిరుమలను ప్రచార కేంద్రంగా, వివాదాస్పద స్థలంగా రాజకీయ అవసరాలకోసం చిత్రీకరించడం హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. టీటీడీలో చిన్న సంఘటన జరిగిన స్వార్థ ప్రయోజనాలకోసం పెద్ద ఎత్తున రాజకీయం చేయడం దురదృష్టకరమని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
ప్రపంచంలోనే అన్ని ఆలయాలకు తిరుమల శ్రీవారి ఆలయమే రోల్ మోడల్ ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కొందరు రాజకీయ నాయకులకు మాత్రమే అన్ని అపవిత్రంగా కనిపిస్తాయి. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు. మేము అధికారంలో లేము కాబట్టి ఏదైనా రాజకీయం చేయొచ్చు అనే ధోరణిలో ఉన్నారని ఆయన తెలిపారు. భక్తులకు, కోట్లాది హిందువులకు తిరుమలలో మంచి విషయాలు కనిపిస్తాయి…. ఏపీ రాజకీయ నాయకులకు మాత్రమే అన్ని అపవిత్రాలే కనిపిస్తున్నాయి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలకు విపక్ష పార్టీలు స్వస్తి పలకాలని స్పష్టం చేశారు