మిస్టర్ టీ బ్రాండ్ నవీన్ రెడ్డికి నగరబహిష్కరణ
posted on Oct 16, 2025 9:17AM

మిస్టర్ టీ బ్రాండ్ యజమాని నవీన్ రెడ్డిని ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేస్తూ రాచకొండ పీసీ సుధీర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. మిస్టర్ టీ బ్రాండ్ యజమాని నవీన్ రెడ్డి ఆదిభట్ల పోలీస్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడన్న పోసులున నివేదికల ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. నవీన్ రెడ్డి పై ఐదు కేసులు నమోదు అయ్యాయి. అంతే కాకుండా సాక్షులను బెదిరిస్తూ, నగరంలో భయాందోళనలను సృష్టిస్తున్నట్లు పోలీసుల నివేదికలు పేర్కొన్నాయి.
ఆదిబట్ల ఇన్స్పెక్టర్, ఇబ్రహీంపట్నం ఏసీపీ నివేదికల ఆధారంగా నవీన్ రెడ్డికి నగర బహిష్కరణ విధిస్తూ చర్య తీసుకున్నట్లు సుధీర్ బాబు తెలిపారు. 2022లో డెంటల్ విద్యార్థిని నిశ్చితార్థ వేడుకలో తన గ్యాంగ్‌తో కిడ్నాప్ చేసిన ఘటన, అలాగే డెంటల్ డాక్టర్ ఇంట్లో హంగామా చేసి ఆస్తి ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి నవీన్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే బాధిత విద్యార్థిని, ఆమె కుటుంబాన్ని బెదరిస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్ ఉంది.