వాహనదారుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ మార్షల్
posted on Oct 16, 2025 9:37AM

ట్రాఫిక్ నియంత్రణ మాత్రమే కాదు.. ఆపదలో ఉన్న వారికి మేమున్నామంటూ తోడుగా నిలుస్తామని నిరూపించాడు ఓ ట్రాఫిక్ మార్షల్. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ట్రాఫిక్ మార్షల్ ఓ ద్విచక్ర వాహనదారుల ప్రాణాలను రక్షించి జనం ప్రశంసలు అందుకున్న ఘటన ఇది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులను ట్రాఫిక్ మార్షల్ క్షణాల్లో మృత్యువు నుండి బయట పడేసాడు. ఒక విధంగా చెప్పా లంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తు న్నంత సేపు పై నుండి దేవుడు దిగివచ్చి బస్సు కింద పడిపోయిన వాహనదారుడిని మృత్యువు నుండి రక్షించాడా అనిపిస్తుంది.
జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు బైక్ పై సూరారం సిగ్నల్ వద్ద బస్సు పక్కన నుండి వెళ్తుండగా... ఒక్కసారిగా ద్విచక్ర వాహన దారుడు అదుపుతప్పి బస్సు కింద పడిపో యాడు. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ మార్షల్ శివకుమార్ వెంటనే స్పందించి పరుగు పరుగున వచ్చి బస్సు ఆపి... బస్సు కిందపడిన ద్విచక్ర వాహన దారుడిని రక్షిం చాడు. క్ష ణాల్లో ఆ వాహనదారుడికి మృత్యు వాత తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శివకుమార్ సమ యస్ఫూర్తితో స్పందించి అతని రక్షించిన తీరును చూసి వాహనదా రులు శివకుమార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సిసిటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.