స్త్రీశక్తి పథకం ఇప్పుడు ఆ బస్సులకు కూడా!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 15 నుంచి ప్రారంభించిన  స్త్రీ శక్తి  పథకానికి అనూహ్య స్పందన లభిస్తున్నది. ఈ పథకం ద్వారా ఐదు రకాల ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. అయితే ఇప్పటి వరకూ ఎంపిక చేసిన బస్సులలోనే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండగా, చంద్రబాబు సర్కార్ ఇప్పుడు దీనిని విస్తరించింది. ఇప్పుడు గ్రౌండ్ బుకింగ్ విధానంలో నడిచే బస్సులలోనూ అంటే.. కండక్టర్ లేకండా నడిపే బస్సులలో కూడా స్త్రీశక్తి పథకం కింద ఉచిత ప్రయాణానికి మహిళలకు అవకాశం ఉంటుంది. అంటే రెండు మూడు బస్టాండ్ లలో మాత్రమే ఆగే  సర్వీసులలో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.  

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలు ఘాట్ రోడ్డులపై వెళ్లే బస్సులలో కూడా స్త్రీ శక్తి పథకం వర్తిస్తుంది.  సింహాచలం కొండపైకి వెళ్లే సిటీ బస్సుల్లోనూ  స్త్రీ శక్తి పథకం అమలు చేస్తున్నారు. యాత్రికుల ఇబ్బందులు తలెత్తకుండా ఆ బస్సులకు ఘాట్ టోల్ ఫీజు మినహాయించాలని ఆర్టీసీ అధికారులు దేవస్థానం ఈవోకి లేఖ రాసి ప్రత్యేక అనుమతి తీసుకున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu