మన శంకర వరప్రసాద్ గారు ఫస్ట్ రివ్యూ.. సెన్సార్ రిపోర్ట్ ఏంటి..?
on Jan 5, 2026

ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తున్న 2026 సంక్రాంతి సినిమాలలో 'మన శంకర వరప్రసాద్ గారు' ముందు వరుసలో ఉంటుంది. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వెంకటేష్ ప్రత్యేక పాత్ర పోషించడం అదనపు ఆకర్షణగా నిలిచింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న 'మన శంకర వరప్రసాద్ గారు'పై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. (Mana Shankara Vara Prasad Garu)
తాజాగా 'మన శంకర వరప్రసాద్ గారు' సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ లభించింది. రన్ టైంని 2 గంటల 42 నిమిషాలకు లాక్ చేసినట్లు సమాచారం.
'మన శంకర వరప్రసాద్ గారు' సెన్సార్ రిపోర్ట్ పాజిటివ్ గా ఉంది. అనిల్ రావిపూడి శైలిలో ఎంటర్టైన్మెంట్ అదిరిపోయిందట. ఇక చిరంజీవి కామెడీ టైమింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. తనదైన కామెడీ టైమింగ్ తో వన్ మ్యాన్ షోలా ఈ సినిమాని నడిపించారట. చిరంజీవి, నయనతార ట్రాక్ బాగుందట. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా కామెడీతో పాటు డ్రామా కూడా బాగా పండిందని చెబుతున్నారు. ఇక చివరిలో వెంకటేష్ రాకతో సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిందని, చిరు-వెంకీ కాంబో సీన్స్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అని అంటున్నారు.
Also Read: బాలయ్య ఫ్యాన్స్ కి ఊహించని షాక్!
మొత్తానికి 'మన శంకర వరప్రసాద్ గారు' అసలుసిసలైన పండగ సినిమాలా ఉందని, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టే అవకాశముందనే మాట వినిపిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



