టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం ఇంజిన్లో మంటలు

విమానాలలో ఇటీవలి కాలంలో తరచుగా తలెత్తుతునన లోపాలు, సంభవిస్తున్న ప్రమాదాలతో జనం విమాన ప్రయాణమంటూనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా ఎయిర్ ఇండియా విమానం గాల్లో  ఎగురుతుండగానే ఇంజిన్లో మంటలు చెలరేగాయి. ఆదివారం (ఆగస్టు 31) ఢిల్లీ నుంచి ఇండోర్ వెళ్లేందుకు టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్లో   టేకాఫ్ అయిన కొద్ది సేపటికే మంటలు చెలరేగాయి.

ఈ సంఘటన జరిగిన సమయంలో విమానంలో 90 మంది ప్రయాణీకులు  ఉన్నారు. పైలట్ అప్రమత్తతతో వెంటనే విమానాన్ని వెనక్కు మళ్లించి  ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణీకులంతా సురక్షితంగా బయటపడ్డారు.  విమానం ఇంజిన్లో మంటలు రావడానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu