అనుమానాస్పద స్థితిలో ఐఏఎస్ జీకే కిషోర్ కుమార్ సతీమణి మృతి

 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి జీకే కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక అనుమానాస్పద స్థితిలో నిన్న అర్ధరాత్రి  మరణించారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆమెకు గొంతు ఇన్ఫెక్షన్ కూడా రావడంతో ఆసుపత్రిలో చేరారు.  విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సత్య దీపిక చికిత్స తీసుకుంటున్నారు. నిన్న అర్ధరాత్రి సమయంలో ఆమె కన్నుమూశారు. ఆ సమయంలో ఆమె భర్త  ఒక్కరే ఆమె పక్కన ఉన్నారు.  

ఈమె ఆకస్మిక మృతి పట్ల ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వా సుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత ఆ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇలా ఉండగా ఐఏఎస్ అధికార జీకే కిషోర్ కుమార్ ప్రస్తుతం ఏపీ మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu