సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన.. ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించడానికీ, పర్యవేక్షిం చడానికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్టును సందర్శించనున్నారు.   . ఈ నెల 7 ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌ ద్వారా పోలవరం బయలుదేరనున్నారు.

అక్కడ ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రత్యక్షంగా  పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిం చనున్నారు. ప్రాజెక్టు పనుల వేగం, నాణ్యత, గడువులపై  అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.   చంద్రబాబు  పర్యటనతో ప్రాజెక్టు పనులకు మరింత వేగం పుంజుకోవడం ఖాయమని   అధికారులు అంటున్నారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం అక్కడ నుంచి బయలుదేరి  ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. అనంతరం సాయంత్రం   విజయవాడలోని సిద్దార్థ కాలేజీ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో చంద్రబాబు పాల్గొంటారు.

2014-19 మధ్య కాలంలో చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం పనులు పరుగులు పెట్టాయి. అప్పట్లో ఆయన సోమవారం కు పోలవారం అని నామకరణం చేసి మరీ క్రమం తప్పకుండా ప్రాజెక్టు పనులను పరిశీలించేవారు. అయితే ఆ తరువాత 2019లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయిన తరువాత పోలవరం పనులు పడకేశాయి. మళ్లీ 2024లో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాతనే పోలవరం పనులు వేగం పుంజుకున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu