సృష్టి కేసు.. ముగ్గురు వైద్యుల సస్పెండ్

 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి సంతాన సాఫల్య కేంద్రంలో ముగ్గురు వైద్యలపై  ఏపీ ప్రభుత్వం  చర్యలు తీసుకుంది. ఆంధ్ర వైద్య కళాశాల అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్‌ రవి, గైనకాలజీ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఉషాదేవి, శ్రీకాకుళం వైద్య కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విద్యుల్లతపై సస్పెన్షన్‌ వేటు వేసింది. హెల్త్ మినిస్టర్ సత్యకుమార్‌ ఆదేశాలతో ముగ్గురిని సస్పెండ్‌ చేస్తూ సంబంధిత శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురిపై హైదరాబాద్‌లో కేసులు నమోదు కావడంతో కూటమి ప్రభుత్వం చర్యలకు దిగింది. 

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత పిల్లలు లేని దంపతులనే లక్ష్యంగా చేసుకుని లక్షల్లో వసూళ్లకు పాల్పడింది. అబార్షన్‌ కోసం ఆస్పత్రికి వచ్చే గర్భిణీలకు డబ్బులు ఆశ చూపి ప్రసవం తర్వాత వారి పిల్లల్ని కోనుగోలు చేసి సరోగసి ద్వారా పుట్టిన బిడ్డగా నమ్మించి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు నమ్రత కన్ఫెషన్ రిపోర్ట్​లో పోలీసులు పేర్కొన్నా సంగతి తెలిసిందే

Online Jyotish
Tone Academy
KidsOne Telugu