టికెట్ ఇవ్వకపోతే వైసీపీలోకే...
posted on Apr 10, 2017 6:03PM

ఇప్పటి వరకూ ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలోకి వైసీపీ నేతలు జంప్ అవ్వడానికి మొగ్గు చూపుతుంటే.. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఓ టీడీపీ నేత వైసీపీలోకి జంప్ అవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అతనెవరో కాదు... టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. శిల్పా మోహన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పే ఉద్దేశంలో ఉన్నట్టు.. అంతేకాదు వైఎస్సార్సీపీలో చేరనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. నంద్యాల ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు తనకు టీడీపీ తరపున టికెట్ లభించకపోతే, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారని, వైఎస్సార్సీపీలో చేరతారని ఆయన సన్నిహితుల సమాచారం. నంద్యాల టికెట్ తమనే ఇవ్వాలని శిల్పా పట్టుబడుతున్నారు. టికెట్ భూమా కుటుంబానికి కాకుండా తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో.. టికెట్ ఎవరికి ఇస్తారో.. తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.