ఎవరు ఆపలేరు..జియో నుంచి దిమ్మతిరిగే కొత్త ఆఫర్లు
posted on Apr 10, 2017 6:11PM

ఉచిత ఆఫర్లతో భారత టెలికాం ఇండస్ట్రీని షేక్ చేస్తోన్న రిలయన్స్ జియో తాజాగా మరో బాంబు పేల్చింది..తన నెట్‌వర్క్ నుంచి మరిన్ని ఆఫర్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు జియో తన అధికారిక వెబ్‌సైట్లో వెల్లడించింది. త్వరలోనే మేము మా టారిఫ్ ప్యాక్స్‌ను అప్‌డేట్ చేస్తాం..మరిన్ని అద్భుతమైన ఆఫర్లను ప్రవేశపెడతాం అన్నది ఆ ప్రకటన సారాంశం. దీనిని బట్టి కొత్త కస్టమర్లకు అల్ట్రా-అఫోర్డబుల్ డేటా టారిఫ్స్‌తో పాటు, జియో ప్రైమ్ మెంబర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను ఇవ్వబోతున్నట్లు సమాచారం.
ఇటీవల తీసుకువచ్చిన సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్‌ను వెంటనే విత్ డ్రా చేసుకోమని ట్రాయ్ జియోని ఆదేశించింది..దీంతో టెలికాం ఇండస్ట్రీలోని ఇతర ఆపరేటర్లు కొంత ఊరట చెందారు. కానీ ఆ ఆనందం వారికి ఎక్కువసేపు ఉండకుండా చేసేందుకు టారిఫ్ ప్లాన్స్‌ను అప్‌డేట్ చేయబోతున్నట్లు ప్రకటించడంతో మళ్లీ జియో తాజాగా ప్రకటనతో ప్రత్యర్థి కంపెనీల వెన్నులో వణుకు పుడుతోంది. జియో ఇంకెంత చౌకైన టారిఫ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెస్తుందోనన్న ఉత్కంఠ అటు టెలికాం రంగంతో పాటు, ఇటు ప్రజల్లో కూడా నెలకొంది. మరి ఆ కొత్త ఆఫర్ల వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.