మహిళల బాత్ రూంలో సెల్ ఫోన్.. పోలీసుల అదుపులో సైట్ ఇంజినీర్?
posted on Oct 10, 2025 9:46AM

చిత్తూరులోని అపోలో యూనివర్సిటీలోని మహిళ టాయిలెట్ లో రహస్యంగా మొబైల్ ఫోన్ ఉంచి.. అసభ్యంగా ఫొటోలు తీస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాష్ రూమ్ కు వెళ్లిన ఓ ఆమ్మాయి.. దీనిని గుర్తించి వెంటనే వర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో యాజమాన్యం విషయాన్ని గోప్యంగా ఉంచి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల దర్యాప్తుతో ఆ సెల్ ఫోన్ ను రహస్యంగా మహిళల టాయిలెట్ లో అమర్చినది ఒక సైట్ ఇంజినీర్ గా గుర్తించి ఆ సైట్ ఇంజినీర్ ను అదుపులోనికి తీసుకున్నారు. ఈ నెల 1న ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. గోప్యంగా ఉంచగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కళాశాల యాజమాన్యం పోలీసులకు గుట్టుచప్పుడు కాకుండా పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాత్రూమ్ లో మొబైల్ ఫోన్ అమర్చిన ఓ సైట్ ఇంజనీర్ ను అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 1న ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై వివరాలు వెల్లడించేందుకు అటు పోలీసలు కానీ, ఇటు వర్సిటీ యాజమాన్యం కానీ సుముఖత చూపడం లేదు.