బాల సదన్‌లో రెహమాన్‌పై మరో కేసు నమోదు

 

హైదరాబాద్ సైదాబాద్ బాలసదన్‌లో  ఓ చిన్నారి బాలుడిని లైంగిక వేధింపులకు గురిచేసిన రెహమాన్‌పై మరో కేసు నమోదు అయింది... బాలసదన్ లో పనిచేస్తున్న రెహమాన్ అందులో ఉన్న చిన్నారి బాలుడు పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ బాలుడిని ఇంటికి పంపించాడు. ఇంటికి వెళ్లిన బాలుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో బాలుడి తల్లిదండ్రులు అతని హాస్పిటల్ కి తీసుకువెళ్లగా అతనిపై లైంగిక దాడి జరిగినట్లుగా తెలుసుకొని తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. 

అనంతరం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రెహమాన్ ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే రెహమాన్ చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సైదాబాద్ పోలీసులు తాజాగా రెహమాన్ పై మరో కేసు నమోదు చేశారు. హోమ్ లో ఉన్న 8 మంది చిన్నారులపై కూడా రెహమాన్ లైంగిక దాడి చేశాడని మరో ముగ్గురు చిన్నారులను వేధింపులకు గురి చేసినట్లుగా తెలిసింది. కామంతో రగిలిపో తున్న రెహమాన్ హోమ్ లో ఉన్న అభం శుభం తెలియని చిన్నారులను తీసుకువెళ్లి లైంగిక వాంఛ తీర్చుకు నేవాడు. ఈ విధంగా రెహమాన్ 8 మంది చిన్నారులను భయభ్రాంతులకు గురిచేసి రాత్రి సమయంలో వారిని బాత్రూం లోకి తీసుకువెళ్లి... లైంగిక దాడి చేసి వికృతి కోరికలు తీర్చుకునేవాడు. 

మరో ముగ్గురు చిన్నారులను వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటనలు వెలుగులోకి రావడంతో పోలీసులు రహమాన్ ఫైన ఫోక్సో యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే రెండు కేసులు నమోదు కాగా ఇప్పుడు తాజాగా మరో కేసు నమోదు కావడంతో రెహమాన్‌పై కేసుల సంఖ్య మూడుకు చేరుకుంది... చిల్డ్రన్స్ హోమ్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ హోమ్ కి చెందిన 8 మంది చిన్నారులపై రెహమాన్ లైంగిక దాడి చేశాడని... మరో ముగ్గురిని తనకు సహకరించాలంటూ వేధింపు లకు గురి చేసాడని తెలిపారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu