ఆర్కే నగర్ ఉపఎన్నిక రద్దు... 50 మంది అరెస్ట్...

 

నిజానికి ఆర్కే నగర్ నియోజకవర్గ ఉపఎన్నిక రేపు జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శశికళ వర్గానికి చెందిన వారు రూ. 89 కోట్లు ఓటర్లకు పెంచిపెట్టినట్టు ఐటీ అధికారులు ఎన్నికల సంఘానికి తెలియజేయడంతో.. ఈసీ ఉపఎన్నికను రద్దు చేసింది. అయితే ఇప్పుడు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికను రద్దు చేసినందుకుగాను ధర్నాకు దిగారు. శశికళ తరుపున పోటీలో దిగిన దినకరన్ మాత్రమే డబ్బులు పంచాడని, ఎన్నికల్లో అతన్ని మాత్రమే అనర్హుడిగా ప్రకటించి, ఎన్నికలను నిర్వహించి ఉంటే బాగుండేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 50 మందిని అరెస్ట్ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu