57 మంది ఉగ్రవాదులు హతం....

 

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 57 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందనుకుంటున్నారా..? ఆఫ్రికా దేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం...ఆఫ్రికా దేశమైన నైగర్ లో ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థ బోకోహారమ్‌ కు సంబంధించిన ఉగ్రవాదులు డిఫా ప్రాంతంలోని గుయెస్కెరో గ్రామంపై దాడి చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన నైగర్ సైన్యం వారిపై విరుచుకుపడింది.  ఏకంగా 57 మంది ముష్కరులను మట్టుబెట్టింది. అంతేకాదు ఈ ఘటనలో 15 మంది సైనికులకు కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. కాగా ఉగ్రవాదుల నుంచి భారీ సంఖ్యలో ఏకే47 తుపాకులు, రాకెట్ లాంచర్ లను సైన్యం స్వాధీనం చేసుకుంది.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu