కోహ్లీని చూస్తే భయమేస్తది..
posted on Apr 10, 2017 5:13PM

టీమిండియా కెప్టెన్ కోహ్లీ పై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ కెప్టెన్సీపై అశ్విన్ మాట్లాడుతూ.. విరాట్ చాలా దూకుడుగా వ్యవహరిస్తాడని...తాను బౌలింగ్ చేసేటప్పుడు ఓ ఫీల్డర్‌ను అక్కడ ఉంచాలా, వద్దా అని ఆలోచించాల్సిన అవసరం రాదని..ఫీల్డ్ సెట్ చేయడంలోనూ విరాట్ దూకుడుగా ఉంటాడని... అతను ఓ ఫీల్డింగ్ మోహరిస్తే అటాకింగ్‌గా ఉందా లేదా అని చూడాల్సిన అవసరమే ఉండదని కితాబిచ్చాడు. రెండేళ్లులో ఓ ప్లేయర్‌గా విరాట్ ఎంతో పరిణతి సాధించడానికి, ఓ తరాన్ని మార్చగలిగే సత్తా ఉన్న ప్లేయర్ అతడని అశ్విన్ అన్నాడు. అంతేకాదు ఒక్కోసారి అతన్ని చూస్తే తనకు కాస్త భయమేస్తుందని అన్నాడు. ఇంకా ధోని కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ... కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించడం అంత సులువైన పని కాదని, ఐదేళ్ల ఆ భారాన్ని మోసిన ధోనీకి హ్యాట్సాఫ్ అని అశ్విన్ చెప్పాడు.