రాంగోపాల్ వర్మ మాట తప్పాడా..?

 

ట్విట్టర్ అనే ఆయుధంతో వివాదాల శర్మ రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. వ్యక్తి ఎవరైనా.. మేటర్ ఏదైనా కానీ తనకు ఇష్టమొచ్చినట్టు కామెంట్లు విసిరేస్తుంటాడు. అయితే అందరిసంగతేమో కానీ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఏదో ఒక కామెంట్ విసరనిదే వర్మకు అస్సలు నిద్రపట్టదు. ఒకపక్క నేనూ పవన్ కళ్యాణ్ కు పిచ్చ అభిమానిని అంటూనే.. ఆయనపై వేయాల్సిన సెటైర్లు అన్నీ వేసేస్తుంటాడు. ఇక వర్మ చేసే కామెంట్లకు పవన్ అభిమానులైతే ఆయనపై పవర్ పంచ్ లు విసురుతుంటారు. అయితే గత కొద్ది నెలల నుండి పవన్ కళ్యాణ్ పై తన ప్రతాపాన్ని చూపించిన వర్మ ఆ తరువాత తాను ఇంక పవన్ కళ్యాణ్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని.. తాను ఏమన్నా పవన్ అభిమానులు తప్పుడు కోణంలోనే చూస్తున్నారని... ఇదే లాస్ట్ ట్విట్ అని ట్విట్టర్ సాక్షి చెప్పాడు. కానీ అది చెప్పిన కొన్ని రోజులకే మళ్లీ పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించాడు.

 


అల్లుఅర్జున్, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సరైనోడు సినిమా గురించి వర్మ మాట్లాడుతూ తను ఇచ్చిన మాటను తప్పాడు.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌, స్టైలిష్ స్టార్‌ అర్జున్‌లను పోల్చుతూ.."ఈ ఇద్దరు మెగా స్టార్ హీరోలలో ఎవరు ఎక్కువ?" అని ప్రశ్నిస్తూ, తన దైన శైలిలో క్లారిటీని ఇచ్చారు. 'సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమా కంటే, అల్లు అర్జున్ నటించిన 'సరైనోడు' పెద్ద హిట్‌ని దక్కించుకుందని అందుచేత 'పవన్ కళ్యాణ్ కంటే అల్లూ అర్జున్ ఎక్కువ?' అంటూ ట్విట్టర్‌లో వర్మ తెలిపారు.


అంతేకాదు ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ఘాటుగా స్పందించిన నేపథ్యంలో ఈ విషయంలో కూడా వర్మ పవన్ పై కామెంట్లు విసిరారు. ప్రత్యేక హోదా గురించి అడుక్కుంటూ పవన్ కళ్యాణ్ బెగ్గర్ సింగ్ కావద్దు.. గబ్బర్ సింగ్ కావాలి.. అయినా ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేస్తే వస్తుంది కానీ.. విన్నపాలు చేస్తే రాదు అని సెటైర్లు విసిరాడు. అక్కడితో ఆగకుండా..  అభిమానులైన మాకు.. మీ నోటి నుంచి హెచ్చరికలు వినాలి. మీ నోటి నుంచి విన్నపాలు వినటం కర్ణ కఠోరంగా ఉంది' అని ఘాటుగా స్పందించారు. కేసీఆర్ లా తాట తీస్తాననే హీరో కావాలి.. అరే కెసిఆర్‌లా నీ తాట తీస్తాననే పవర్ హీరో మాకు కావాలి.. అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదని, రియల్ స్టార్ కెసిఆర్ అన్నాడు.

 

మరి ఇన్ని నీతులు చెప్పే రాంగోపాల్ వర్మ తాను పవన్ కళ్యాణ్ విషయంలో ఇంకెప్పుడు జోక్యం చేసుకోనని మాట ఇచ్చి.. ఇప్పుడు మాట ఎందుకు తప్పినట్టో అని అనుకొనేవారుకూడా ఉన్నారు. మరి అది రాంగోపాల్ వర్మకే తెలియాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu