నటుడు రాహుల్ రామకృష్ణ వెనకున్న శక్తులేవి?
posted on Oct 5, 2025 12:44PM
.webp)
దసరాకు కక్కా ముక్క లేదని ఫీలైన వారికి పెద్ద ఎత్తున కిక్కునందించారు అర్జున్ రెడ్డి, జాతిరత్నాలు ఫేమ్ రామకృష్ణ. సైన్మా అనే తరుణ్ భాస్కర్ షార్ట్ ఫిలింతో లైమ్ లైట్లోకి వచ్చిన రాహుల్ క్రమేపీ వెండితెరమీద ఒక చిన్న పాటి నటుడిగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. దానికి తోడు బిగ్గెస్ట్ హిట్స్ లో పార్టిసిపేషన్ ఉండటంతో.. రీసెంట్ టైమ్స్- పాపులర్ ఆర్టిస్టుల్లో తను కూడా ఒకరిగా పేరు సాధించారు.
తాజాగా ఈయన చేసిన ట్వీట్ ఇటు సోషల్ మీడియా వర్గాలతో పాటు, అటు రాజకీయ వర్గాల్లోనూ ఒక కలకలం చెలరేగేలా చేసింది. ఇప్పటికే సారే రావాలంటున్నరు.. తెలంగాణ పల్లెల్లోన అనే పాటలు, దేఖ్ లేంగే వంటి డ్యాన్సులతో బీఆర్ఎస్ ఒక టైప్ ఆఫ్ ప్రో అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటోంది.
కారణం ఏంటంటే తాము ఓడిందే సోషల్ మీడియా ప్రభావం వల్ల. కాబట్టి ఈ దిశగా ఒక నిర్ణయానికి వచ్చిన కేటీఆర్, ఇది వరకే కొందరు సోషల్ మీడియా కూలీలను హైర్ చేస్కున్నారు కూడా.. అందులో భాగంగా ఇటీవల కొందరు సీఎం రేవంత్ కి వ్యతిరేకంగా భారీ ఎత్తున ట్రోలింగ్ కి పాల్పడ్డ కారణంగా అరెస్టు కావడం తెలిసిందే.
దీంతో ప్లాన్ నెంబర్ వన్ వర్కవుట్ అయ్యిందని భావించిన కేటీఆర్ నెక్స్ట్ లెవల్ లోకి వెళ్లారన్నది ఒక టాక్. ఆయన గతంలోనే అన్నారు.. తాను యూట్యూబ్ చానెళ్లు పెట్టుకోకుండా అనవసరంగా అభివృద్ధి పనులు చేశానని. దీన్నిబట్టీ చూస్తే సోషల్ మీడియాను తమకు అనుకూలంగా యాక్టివేట్ చేస్కుంటే అది వచ్చే రోజుల్లో మనకు పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడం ఖాయం అన్న కోణంలో స్టెప్ బై స్టెప్ కేటీఆర్ ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది.
బేసిగ్గా కేటీఆర్ కి ట్విట్టర్ కింగ్ అన్న పేరుంది కాంగ్రెస్ వర్గాల్లో. అంటే సోషల్ మీడియా వేదికపై యాక్టివ్ గా ఉండే కొందరంటే కొందరు పొలిటీషియన్లలో ఆయనకు ఆయనే సాటి. ఈ విషయంలో మరో అడుగు ముందుకేసిన కేటీఆర్.. తన గురించి తాను మాత్రమే చెప్పుకుంటే కిక్కేముందీ? అదే మన గురించి ఇతరులు చెబితే ఆ లెవలే వేరుగా ఉంటుందని భావించారో ఏమో.. ఇదిగో.. రాహుల్ రామకృష్ణ వంటి వారిని గిల్లి వదిలినట్టున్నారని అంటారు కొందరు.
ఇటు రాహుల్ కూడా దసరా సందర్భంగా కక్కా ముక్కా లేని వైరాగ్యంలో కేసీఆర్ రావాలని జనం కోరుకుంటున్నారన్న యాంగిల్లో కామెంట్ల కాక రేపారు. ఇది క్షణాల్లో వైరల్ కావడంతో తన ఖాతా నుంచి వైదొలగాల్సి వచ్చింది కూడా.
ఇంతకీ ఏంటీ రాహుల్ రామకృష్ణ ఇంతటి వైరాగ్యానికి గల కారణమని చూస్తే ఆయన ఐదేళ్ల క్రితం ఒక ట్వీట్ చేశారు. బాల్యంలో తాను అత్యాచారానికి గురయ్యానంటూ అప్పట్లో ఆయన చేసిన ట్వీట్ ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, కొందరు విశ్లేషకులు అంటున్న మాటలేంటంటే.. మనకు పైకి కనిపించేంత జనరల్ కండీషన్లో రాహుల్ రామకృష్ణ లేడని తెలుస్తోంది.
ఇక్కడ రాహుల్ రామకృష్ణలోని మరో యాంగిల్ ఏంటంటే, గాంధీ కి వ్యతిరేకంగానూ కొన్ని కామెంట్లు గుప్పించారాయన. ఇది బీజేపీకి వర్గాల వారికి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అయితే బీఆర్ఎస్, లేదా బీజేపీకి ప్రో కామెంట్లు చేస్తే ఆయన రాజకీయ విధానం ఏంటో స్పష్టంగా తెలుస్తుంది.
కానీ ఇదేంటీ ఈ రెండూ మిక్స్ చేసి కొట్టడమేంటన్నది ఎవరీకీ అర్ధం కావడం లేదు. కొంపదీసి ఇదిగానీ బీఆర్ఎస్- బీజేపీలో విలీనం అవుతుందనడానికి సంకేతమా? ఏంటన్నది కూడా ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఎనీహౌ రాహుల్ రామకృష్ణ ఆయనకు ఆయన ఏదైనా స్వయంగానే ఈ కామెంట్లు చేశారా? లేక కేటీఆర్ ఇన్ ఫ్లూయెన్స్ తో ఇలాంటి వ్యాఖ్య నిర్మాణం వెలుగులోకి వచ్చిందా? తేలాలంటే మరికొన్నాళ్ల పాటు మనం వేచి చూడాల్సిందే.