పతంజలి సిమ్ కార్డుతో భారీ డిస్కౌంట్లు

 

రామదేవ్ బాబాగారు ఎప్పుడు ఎలాంటి ఉత్పత్తులను తీసుకువస్తారో చెప్పడం కష్టం. కాకపోతే డిమాండ్ ఉన్న చాలా రంగాలలో పతంజలిని కూడా పోటీకి దింపుతారన్నది మాత్రం నిజం. అదే బాటలో ఇప్పుడు పతంజలి సిమ్ కార్డులు కూడా వచ్చేశాయి. ప్రస్తుతం ఈ సిమ్ కార్డులు పతంజలి ఉద్యోగులకు మాత్రమే పరిమితం. కానీ త్వరలోనే ఇవి మార్కెట్లో ఇతర వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇతర కంపెనీలలాగానే పతంజలి నెట్‌వర్కులో కూడా తక్కువ ధరకు అన్‌లిమిటెడ్‌ ఆఫర్స్‌ ఉన్నాయి. అంతేకాదు! ఈ సిమ్‌ కార్డు ఉన్నవారు పతంజలి ఉత్పత్తుల మీద భారీ డిస్కౌంటు పొందే సౌలభ్యం కూడా ఉంది. పతంజలి, బీఎస్ఎన్‌ఎల్‌ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ సిమ్ కార్డులు విడుదల అవుతున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu