130 ఏళ్ల తర్వాత భారతీయుడికి దక్కిన అవార్డు

 

లీనియన్ మెడల్ గురించి మనలో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ బయాలజీ విభాగంలో ఇదో అత్యున్నత పురస్కారంగా భావిస్తారు. ఇంగ్లండ్‌కు చెందిన Linnean Society of London ఏటా ఈ పురస్కారాన్ని అందిస్తుంది. విచిత్రం ఏమిటంటే... 1888లో స్థాపించిన ఈ పురస్కారం ఇప్పటివరకు భారతీయుడిని వరించలేదు. ఈ ఏడాది తొలిసారి బెంగళూరులో ఓ పరిశోధనా సంస్థకి చెందిన కమల్‌జీత్ బావా అనే శాస్త్రవేత్తకి దక్కింది. అడవుల నరకివేత, అటవీ ఉత్పత్తుల మీద కమల్‌జీత్‌ చేసిన ప్రచారానికి గాను ఈ పురస్కారం అందించినట్లు లీనియర్‌ సంస్థ తెలియచేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu