మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం....
posted on Apr 11, 2017 11:11AM
.jpg)
ఏపీలో ఇటీవల కొన్ని స్థానాలకు గాను జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా టీడీపీ ఘన విజయం సాధించింది. ఏపీలో వివిధ మున్సిపాలిటీల్లోని పలు వార్డులకు ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ విజయం సాధించింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీలో మూడు వార్డులకు ఉపఎన్నికలు జరగగా.. అన్నింటిలో టీడీపీ విజయం సాధించింది. హిందూపురం 9వ వార్డులో 939 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి బోయ శాంతి విజయం సాధించారు. చిత్తూరు 38వ డివిజన్ లో టీడీపీ అభ్యర్థి వసంత కుమార్ వైకాపా అభ్యర్థిపై 1,508 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎలమంచిలి మున్సిపాలిటీ 31వ వార్డు, మాచర్ల 15వ వార్డులో టీడీపీ గెలవగా, 16వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.