ఎంత ట్రంపరితనం?
posted on Sep 10, 2025 8:03PM

ఉదయం ఉన్న మాట మధ్యాహ్నానికి.. మధ్యాహ్నం మాట సాయంత్రానికి ఉండటం లేదు. దటీజ్ ట్రంప్. ట్రంప్ ఒక మాట మీద ఎంత మాత్రం నిలకడ చూపించడం లేదు. ఆయన బేసిగ్గానే అంతేనా?
లేక భారత్ అంటేనే అలా చేస్తున్నారా? ఏం తెలీడం లేదు.
యాభై శాతం సుంకాల విషయంలో.. భారత ప్రధాని తనతో ఎప్పుడు మాట్లాడతాడా? అని తాను ఎదురు చూస్తున్నట్టు చెప్పారు ట్రంప్. ఈ దిశగా తన ట్రూత్ పోస్ట్ లో కామెంట్ చేశారు కూడా. మోడీ కూడా సరిగ్గా ఇలాగే రియాక్టయ్యారు. భారత్ యూఎస్ మంచి ఫ్రెండ్స్ అన్నారు.
కట్ చేస్తే సాయంత్రానికల్లా ట్రంప్ చేసిన కామెంట్ ఏంటంటే.. భారత్. చైనాలపై 100 శాతం సుంకాలు విధించమని యురోపియన్ యూనియన్ కి సూచించారు. ఉదయం మోడీ తాను మంచి మిత్రులం అనడం ఏంటి? ఆయనతో ఎప్పుడు మాట్లాడదామా? అని ఎదురు చూస్తున్నట్టు చెప్పడమేంటి? సడెన్ గా యురోపియన్ యూనియన్ కి ఇలా సూచించడమేంటి?
ఇది ట్రంప్ తప్పా? లేక ట్రంప్ ని మోడీయే సరిగా హ్యాండిల్ చేయలేక పోతున్నారా? ఏమీ అర్ధం కావడం లేదంటారు విదేశాంగ నిపుణులు. సరే ఇదంతా ఎందుకని చూస్తే.. రష్యాను కంట్రోల్ చేయడానికట. ఉక్రెయిన్ లో వీలైనంత త్వరగా శాంతి స్థాపన జరగాలన్నది సగటు యురోపియన్ దేశాల అభిమతమట. అయితే వీరికి ట్రంప్ ఇస్తున్న సూచన ఏంటంటే.. భారత్. చైనాలపై వంద శాతం సుంకాలు విధిస్తే మొత్తం సెట్ అయిపోతుందనడం.
ఇదెక్కడి విడ్డూరమో ఎవరికీ అర్ధం కావడం లేదు. మొన్నటికి మొన్న అలస్కాలో ఇదే ట్రంప్ పుతిన్ ని కలిశారు. చర్చించారు. ఆ సమయంలో తాను అనుకున్నది అనుకున్నట్టు ఆయన చేత చేయించకుండా..ఈ ఇన్ డైరెక్ట్ సెన్స్ లో అర్ధమేంటి? పుతిన్ తనకు ఎంతో మంచి మిత్రుడని చెబుతూ కూడా ఆయన్ను దారికి తెచ్చుకోలేక పోవడమేంటి? రష్యాకు భారత్ చమురు కొనుగోలు చేయడం వల్ల ఆ ఆర్ధిక శక్తితో ఆ దేశం ఉక్రెయిన్ తో యుద్ధం కొనసాగించగలుగుతోందనడం ఏంటి?
నిజానికి భారత్ రష్యా నుంచి కొంటున్న ఆయిల్ వల్ల వచ్చే లాభం కేవలం తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు. దీని ద్వారా క్రూడ్ ఆయిల్ ధరలు ప్రపంచ వ్యాప్తంగా కంట్రోల్లో ఉంటాయి. ఇందు వల్లే భారత్ రష్యా నుంచి ఆయిల్ కొంటోంది. మోకాలికీ బోడిగుండుకూ లింకు పెట్టినట్టు ఏంటీ ట్రంపరితనం??? అన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు.