మోడీ అభినందనలకు చంద్రబాబు థ్యాంక్స్
posted on Oct 12, 2025 10:33AM
.webp)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి మరీ ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అరుదైన మైలురాయిని చేరుకున్న చంద్రబాబుకు ప్రధాని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మోడీ చంద్రబాబు రాజకీయ జీవితం దార్శనికత, సుపరిపాలన పట్ల నిబద్ధత స్థిరంగా కొనసాగాయన్నారు. 2000 సంవత్సరం ప్రారంభంలో తామిద్దరం ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటి నుంచీ అనేక సందర్భాల్లో కలిసి పనిచేశామని గుర్తు చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం చంద్రబాబు ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారని, ఆయనకు అన్నివిధాలా అండగా ఉంటాననీ ప్రధాని పేర్కొన్నారు. కాగా తనకు ఫోన్ చేసి మరీ అభినందించిన ప్రధాని మోడీకి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు మీ దార్శనిక నాయకత్వంలో వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో ఆంధ్రప్రదేశ్‌ను ఒక కీలక శక్తిగా నిలబెడతామని మద్దతుతో స్వర్ణాంధ్రను నిర్మించేందుకు మోడీ సహకారం కావాలని ఆయనీ సందర్భంగా కోరారు. అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఫోన్ కాల్ కు తాను ఎంతో సంతోషిస్తున్నానని చంద్రబాబు అన్నారు.