వీళ్లకి మహిళలంటే ఎంత గౌరవమో... అసలు రంగు
posted on Oct 26, 2015 8:15PM

వీళ్లకి మహిళలంటే ఎంత గౌరవమో... ( అసలు రంగు )
మహిళలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాధినేతలు, మంత్రులు, హోంమంత్రులు, ప్రతిపక్ష నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు, మహిళలంటే తమకెంతో గౌరవం, మహిళల భద్రతే తమ అజెండా... అంటూ ఎన్నికల సమయంలో ఊకదంపుడు ప్రసంగాలు చేసే వీళ్ల అసలు రంగు ఏమిటో... ఆ మాటలేంటో చదవండి...
- ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఎవరో లాక్కెళ్లి అత్యాచారం చేస్తే, మేం ఏం చేయగలం - మహిళా జర్నలిస్టుతో కర్నాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప
- ఇద్దరు కలిసి అత్యాచారం చేస్తే అది గ్యాంగ్ రేప్ కాదు... నలుగురైదుగురు కలిసి చేస్తేనే గ్యాంగ్ రేప్ - కర్నాటక హోంమంత్రి కేజే జార్జ్
- పాశ్చాత్య వస్త్రధారణ వల్లే మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి, మహిళలు హిందూ సంస్కతిని పాటిస్తే అత్యాచారాలు జరగవు, నేడు మహిళలు ధరిస్తున్న దుస్తులు, ప్రవర్తన సరిగా లేదు, నా భార్య చీర మాత్రమే ధరిస్తుందని, అందుకే ఆమెకు అల్లరి మూకల నుంచి వేధింపులు ఏనాడూ లేవు - గోవా మంత్రి దీపక్ ధావలికర్
- మీ దేవుడేమో నల్లనివాడు. మీ మ్యారేజీ బ్యూరో యాడ్స్‌లో మాత్రం తెల్లని వధువులు కావాలని ప్రకటనలిస్తారు, దక్షిణ భారతదేశంలో మహిళలు నల్లగా ఉంటారు. వారి అందం కూడా వారి శరీరాల్లాగే ఉంటుంది - జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్
- మీడియాకు వ్యభిచారానికి లంకె పెట్టిన కేంద్ర మంత్రి వీకే సింగ్, ప్రెస్టిట్యూట్ల ( ప్రాస్టిట్యూట్ ) నుంచి ఎక్కువ ఆశించలేం - మీడియాని ఉద్దేశించిన కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి వీకే సింగ్