నటుడు మోహన్ లాల్‌కు అరుదైన గౌరవం
posted on Sep 20, 2025 8:07PM

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్రం ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది. 2023 సంవత్సరానికి గానూ కేంద్రం ఆయన్ను ఎంపిక చేసింది. ఈ నెల 23న 71వ జాతీయ సినిమా అవార్డును ప్రధానం చేయనున్నారు. కాగా, మోహన్ లాల్ ఇప్పటికే పద్మభూషణ్ పురస్కారం, పద్మశ్రీ అందుకున్నారు. జాతీయ స్థాయిలో ఐదు పురస్కారాలు స్వీకరించారు. ‘భరతమ్’ ‘వానప్రస్థం’ సినిమాలకు గాను రెండు సార్లు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పురస్కారాన్ని దక్కించుకున్నారు.
‘వాన ప్రస్థం’ మూవీగాను బెస్ట్ చిత్ర నిర్మాతగా నేషనల్ అవార్డు అందుకున్నారు. వీటితో జాతీయ స్థాయిలో రెండు సార్లు స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ సహా అన్ని భాషల సినిమాల్లో మోహన్ లాల్ నటించారు. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమలో విశేష ప్రతిభచూపిన మోహన్‌లాల్‌ను తాజాగా కేంద్ర ప్రభుత్వం దాదాసాహేబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది.
ఫాల్కే అవార్డుకు ఎంపికైన మోహన్ లాల్ కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. దశాబ్దాల కృషితో మలయాళ సినిమా, నాటక రంగంలో మోహన్ లాల్ ఉన్నత శిఖరాలు అధిరోహించారు. కేరళ సంస్కృతి పట్ల ఆయనకు ఉన్న మక్కువ అభినందనీయమని..తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ చిత్రాలలో కూడా మోహన్ లాల్ అద్భుతమైన చిత్రాలు చేశారని ప్రధాని పేర్కొన్నారు. ఆయన సాధించిన విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటుని ప్రధాని అక్షాంక్షించారు