మా నాన్నకు ప్రాణహాని! హైకోర్టుకు జడ్జీ రామకృష్ణ కొడుకు లేఖ 

దళిత జడ్జి రామకృష్ణ తనయుడు వంశీకృష్ణ ఆంధ్రప్రదేశ్  హైకోర్టుకు లేఖ రాశారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తన తండ్రికి ప్రాణహాని ఉందని వంశీకృష్ణ లేఖలో తెలిపారు. తన తండ్రి ఉన్న బ్యారెక్‌లోకి అపరిచితుడిని పంపారని, ఆ అపరిచితుడు తన తండ్రిని బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు. ఆ వ్యక్తిని, తన తండ్రిని వేర్వేరు బ్యారెక్‌లో ఉంచాలని వంశీకృష్ణ హైకోర్టును విజ్ఞప్తి చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై  తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ జడ్జి రామకృష్ణను ఏప్రిల్ 15న మదనపల్లెలో పోలీసులు అరెస్ట్ చేశారు.  బీ కొత్తకోట నుంచి మదనపల్లెలో కరోనా టెస్ట్ కోసం వెళుతుండగా దారి మధ్యలో జడ్జి రామకృష్ణ పోలీసులు అదుపులోకి తీసుకొని పీలేరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో హాజరు పర్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.  తన అరెస్ట్ పై రామకృష్ణ స్పందిస్తూ...గతంలో  నంద్యాల ఉపఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నడిరోడ్డుపై కాల్చి చంపాలని అన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు తాను అదే విధంగా అన్నానని చెప్పారు. జగన్ అప్పటి ముఖ్యమంత్రిపై చేసిప వ్యాఖ్యలు తప్పుకానప్పుడు ఇప్పుడు తాను సీఎం జగన్‌ను అంటే దేశ ద్రోహం ఎలా అవుతుందని రామకృష్ణ  ప్రశ్నించారు.

జడ్జి రామకృష్ణ వ్యవహారాన్ని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. మెజిస్ట్రేట్ రామకృష్ణ జీవితం ప్రమాదంలో ఉందని వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి మెజిస్ట్రేట్ రామకృష్ణపై దాడి చేయించారని ప్రతి ఒక్కరికీ తెలుసని అన్నారు. జైలులో ఉన్న రామకృష్ణకు ప్రాణహాని ఉందని తన కుమారుడు వంశీ ఆవేదన చెందుతున్నారని వర్ల రామయ్య అన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu