లొంగుబాటుకు సిద్ధం- జేఎన్‌యూ విద్యార్థులు
posted on Feb 23, 2016 1:58PM
.jpg)
జేఎన్‌యూలో జరిగిన ఘటనలో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య తాము చట్టానికి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించారు. పోలీసులు కనుక తమకు తగిన రక్షణను కల్పించగలిగితే వారికి లొంగిపోయేందుకు తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదంటూ వారు పేర్కొన్నారు. ఈమేరకు వారు దిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఉమర్ ఖాలిద్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన దగ్గర నుంచీ అతని కుటుంబసభ్యులు ఉమర్ క్షేమం గురించి తరచూ ఆందోళనను వ్యక్తం చేసేవారు. అతన్ని చంపుతామంటూ తమకి బెదిరింపులు వస్తున్నాయంటూ వారు మీడియా ముందు వాపోయేవారు. ప్రస్తుతం ఉమర్ విశ్వవిద్యాలయంలో క్షేమంగానే ఉండగా, అతను ఎప్పుడు బయటకు వస్తాడా అని పోలీసులు కాచుకుని కూర్చున్నారు. ఇలాంటి సమయంలో ఉమర్ తాను లొంగిపోయేందుకు సిద్ధం అంటూ ప్రకటించడంతో పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది