Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పోలీసులు అడుగుపెట్టడానికి వీల్లేదు
posted on: Feb 23, 2016 9:01AM

- జేఎన్‌యూలో జరిగిన వివాదాస్పద సంఘటనకు సంబంధించి పోలీసులు ఒక అయిదుగురు విద్యార్థుల కోసం కొద్ది రోజులుగా వెతుకుతున్నారు.
- కన్నయా కుమార్ అనే విద్యార్థి నాయకుడిని అరెస్టు చేసిన తరువాత నుంచీ ఈ విద్యార్థులు అజ్ఞాతంలోకి జారుకున్నారు.
- అయితే ఆదివారం రాత్రి అనూహ్య పరిస్థితులలో ఈ అయిదుగురూ తిరిగి విశ్వవిద్యాలయంలో కనిపించారు.
- ఇంతకు ముందు ఒకసారి పోలీసులను క్యాంపస్‌లోకి అనుమతించినందుకు వివిధ వర్గాల కోపాన్ని చవిచూసిన విశ్వవిద్యాలయపు యాజమాన్యం ఈసారి ఆచితూచి స్పందిస్తోంది.
- ఈ విషయమై ఉప కులపతి ఎం.జగదీశ్ కుమార్ 300 మంది ఉపాధ్యాయులతో కలిసి నిన్న చర్చించారు.
- భవిష్యత్తులో నింద తమ మీద పడకుండా ఉండాలంటే పోలీసులను ఎట్టి పరిస్థితులలోనూ విద్యాలయం క్యాంపస్లోకి అనుమతించరాదని నిర్ణయించారు.
- ఇటు పోలీసులు కూడా బలవంతంగా విశ్వవిద్యాలయం లోపలకి వెళ్లే మరో వివాదంలో ఇరుక్కునేందుకు సిద్ధంగా లేరు.
- నిందితులైన విద్యార్థులు మాత్రం విశ్వవిద్యాలయంలో సురక్షితంగా ఉన్నారు. తమంతట తాము బయటకు వెళ్లి లొంగిపోయేందుకు వారు సిద్ధంగా లేరు.



.jpg)


